newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పఠన కుతూహలం : ఈ వారం దువ్వూరి రామిరెడ్డి పానశాల కావ్యం

23-04-202123-04-2021 16:46:02 IST
2021-04-23T11:16:02.076Z23-04-2021 2021-04-23T11:15:39.561Z - - 14-05-2021

పఠన కుతూహలం : ఈ వారం దువ్వూరి రామిరెడ్డి పానశాల కావ్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆధునిక తెలుగు సాహిత్యంలో కవి కోకిల దువ్వూరి రామిరెడ్డిది ఒక ప్రత్యేకమైన స్థానం. కానీ వారికి రావలసినంత ప్రాచుర్యం, కీర్తి రాలేదనే చెప్పుకోవాలి. 

ఆయన కేవలం కవి మాత్రమే కాదు. నాటక కర్త, సాహితీ విమర్శకులు, బహు భాషా వేత్త, అనువాదకుడు, సినిమా దర్శకుడు, పాటల, మాటల రచయిత. వీటన్నింటికన్నా ముందు రామిరెడ్డి స్వయంగా హలాన్ని చేతపట్టిన రైతు. వారి కావ్యాలలో కృషీవలుడు, పానశాల వారి పేరును తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిపే రచనలు. 

పారశీకం నుంచి ఉమర్ఖయ్యాం రుబాయీలను తెలుగు వారికి అందిస్తూ ఆయన రాసిన పద్యం తెలుగు భాష గురించి, పారశీ భాషను గురించి, అనువాదం గురించి ఆయన భావాల్ని మనకు తెలియచేస్తాయి. 

" పారశీ కన్నా శ్రావ్యమయి 

  పల్లవ కోమలమై 

  సుధారసం బూరెడు మా తెనుఁగు నుడి "

పారశీకము కన్నా తెలుగు శ్రావ్యమైనదని నిర్మొహమాటంగా కావ్యం ఆదిలోనే తేల్చి చెప్పేసారాయన. ఇక తెలుగు ఎలాంటిది? పల్లవ కోమలమైనది; సుధారసం ఊరెడిది. ఇది ఆయన తెలుగు భాషా ప్రియత్వం.   

ఇక ఆయన చేసినది ఉమర్ఖయ్యాం రుబాయిలకు కేవలం అనువాదమా? మక్కికి మక్కి అనువాదం కాదు అని పానశాల కావ్యంలో ఒక్క పద్యం చదివినా ఇట్టే చెప్పేయగలం. తెనుఁగునుడి ఒప్పిదమౌనటు  నీదు భావములు ఏరిచి కూరిచితి అని పానశాల కావ్య అనువాద లక్షణాన్ని మనకు తెలియచేశారాయన. తనకు తాను అనువాదకునిగా కాకుండా తిక్కన, శ్రీనాధుల వలె అనువక్తగా తలపోసుకున్నారు రామిరెడ్డి. 

దువ్వూరి రామిరెడ్డి భావ సాంద్రతకు, తత్వచింతనా గాఢతకు, మృదుమధుర పద భరిత పద్య రచనా కుశలతకు, ఆచంద్ర తారార్కం తార్కాణంగా నిలిచే పానశాల కావ్యంలో నుంచి కొన్ని భాగాలను ఇవాళ చదువు కుందాం.

తెలంగాణ బోర్డర్ వద్ద ఏపీ అంబులెన్స్ లు నిలిపివేత

తెలంగాణ బోర్డర్ వద్ద ఏపీ అంబులెన్స్ లు నిలిపివేత

   11-05-2021

జగన్ మోడీకి భజన చేస్తున్నారు : తులసి రెడ్డి

జగన్ మోడీకి భజన చేస్తున్నారు : తులసి రెడ్డి

   10-05-2021

కరోనా తీవ్రత జూలై 20వరకు... స్వరూపానందేంద్ర స్వామి

కరోనా తీవ్రత జూలై 20వరకు... స్వరూపానందేంద్ర స్వామి

   09-05-2021

అవసరం ఉంది అంటే ఎంత ఖర్చైనా ఆర్డర్ పెట్టండి : సీఎం కేసీఆర్

అవసరం ఉంది అంటే ఎంత ఖర్చైనా ఆర్డర్ పెట్టండి : సీఎం కేసీఆర్

   06-05-2021

పక్క రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణాలో కరోనా కంట్రోల్లో ఉంది : సీఎస్‌

పక్క రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణాలో కరోనా కంట్రోల్లో ఉంది : సీఎస్‌

   06-05-2021

ఆక్సిజన్ సిలెండర్ లు బ్లాక్ చెయ్యొదు.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఆక్సిజన్ సిలెండర్ లు బ్లాక్ చెయ్యొదు.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి

   05-05-2021

ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోవడంపై స్పందించిన బాలయ్య

ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోవడంపై స్పందించిన బాలయ్య

   04-05-2021

ఏపీలో డే కర్ఫ్యూ... సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఏపీలో డే కర్ఫ్యూ... సీఎం జగన్ సంచలన నిర్ణయం

   03-05-2021

పథకం ప్రకారం తనపై కుట్ర ఈటల రాజేందర్‌

పథకం ప్రకారం తనపై కుట్ర ఈటల రాజేందర్‌

   03-05-2021

పఠన కుతూహలం : గుంటూరు శేషేంద్ర శర్మ  నాదేశం - నా ప్రజలు అనే 'ఆధునిక మహాభారతం'

పఠన కుతూహలం : గుంటూరు శేషేంద్ర శర్మ నాదేశం - నా ప్రజలు అనే 'ఆధునిక మహాభారతం'

   03-05-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle