newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపెవరిది?

29-10-202129-10-2021 18:33:34 IST
Updated On 29-10-2021 18:34:57 ISTUpdated On 29-10-20212021-10-29T13:03:34.539Z29-10-2021 2021-10-29T13:03:15.037Z - 2021-10-29T13:04:57.661Z - 29-10-2021

హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపెవరిది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మన రాష్ట్రం మన కోసం కార్యక్రమం ద్వారా మీ అందరికి నమస్కారం. 

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం " మనం ఎంచుకున్న ప్రభుత్వం, మనం ఎన్నుకున్న నాయకులు, మన ప్రగతికోసం అంటూ ప్రభుత్వాలు ఇస్తున్న పతకాలు, వాటి అమలు గురించి నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా మన మనసు విప్పి చర్చించటం. 

మొదటిగా మన తెలంగాణా రాష్ట్రంలో ఉప ఎన్నిక జరుగుతున్న హుజురాబాద్ నియోజకవర్గంతో మొదలుపెట్టి, రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గ ప్రజల అవగాహనలు, ఆలోచనలు, వారి మనసులోని మాటలని మీ ముందు పెట్టటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాము. 

నియోజక వర్గ ప్రజల మనోభావాలలోకి వెళ్లేముందు నియోజకవర్గాన్ని గురించిన వివరాలు కొన్ని తెలుసుకుందాం. 

ఈ నియోజకవర్గానికి చెందిన నాయకుడు ఈటెల రాజేందర్ తెరాస పార్టీ ద్వారా 2019 ఎన్నికలలో కాంగ్రెస్ ప్రత్యర్థి కౌశిక్ రెడ్డిపై 43,719 ఓట్ల మెజారిటీతో గెలుపొంది, ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచటంతో అదే ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పదవీ స్వీకరణ చేశారు, 2021లో ఆయన అసైన్డ్ భూములు కొన్నారనే ఆరోపణలపై తన పదవికి రాజీనామా చేశారు. అంతే కాకుండా తన శాసన సభ పదవికి మరియు తెరాస పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి బీజేపీ లో చేరారు. 

ఈటెల రాజీనామా వలన హుజురాబాద్ నియోజకవర్గానికి మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చాయి. 

హుజురాబాద్ నియోజకవర్గ మొత్తం జనాభాసంఖ్య : 2,89,213 

అందులో పురుషులు : 1,43,623 మరియు మహిళలు : 1,45,590

హుజురాబాద్ నియోజకవర్గ మొత్తం ఓటర్లు : 2,33,103 

అందులో పురుషులు : 1,16,537 మరియు స్త్రీలు : 1,20,563 

హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి. 

1. హుజురాబాద్ ( అర్బన్, రూరల్ ) 

2. జమ్మికుంట (అర్బన్, రురల్ )

3.  కమలాపూర్, 

4. వీణవంక 

హుజురాబాద్ నియోజగవర్గంలో గత 6 ఎన్నికలలోనూ వరుసగా తెరాస విజయం సాధిస్తూ వచ్చింది. అందులో ఈటెల గత 4 ఎన్నికలలో తెరాస పార్టీ నుండి గెలుస్తూ వచ్చారు. 

ఇప్పటివరకు బీజేపీ ఒక్కసారి అనగా 2018 లో జరిగిన ఎన్నికలలో బీజేపీ పోటీ చేయగా కేవలం 1683 ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది. ఆ ఎన్నికలలో నోటాకి 2867 ఓట్లు వచ్చాయి. అంటే బీజేపీ ఓట్లు నోటా కంటే తక్కువ ఓట్లు. 

దీని ఆధారంగా చూస్తే మన ముందుకు వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు 

1. అసలు ఈటెల ఎందుకు రాజీనామా చేశారు ? ఒకవేళ తప్పుచేశారా? చేయక ఉండి ఉంటె ఆయన పార్టీ వీడి, MLA పదవి వీడి ఈ మధ్యంతర ఎన్నికల సిద్ధమయ్యే అవసరమేముంది???

2. కనీసం నోటా కి వచ్చిన ఓట్లు కూడా రాని BJP ఇప్పుడు ఏ ధైర్యంతో మళ్ళీ ఉప ఎన్నికలలో పాల్గొనటానికి సిద్దపడింది? కేవలం ఈటెలకి ఉన్న పేరు ప్రఖ్యాతులని చూసి ప్రజలు ఓటు వేస్తారా లేక బీజేపీ పై అనుకోని ప్రేమ ఏదైనా నియోజకవర్గ ప్రజల్లో మొదలయ్యిందా ???

3. ఒక చిన్నపాటి ఎన్నికలకి ఎందుకు నియోజకవర్గమంతా యుద్ధ భూమిలా మారింది? 

4. మా పర్యటన సమయంలో కనీసం 4 పెద్ద నాయకులు మాకు అక్కడ తటస్తించటం జరిగింది. వీళ్లెవరైనా ఇంతకు ముందు ఈ నియోజకవర్గాన్ని చూసి ఉన్నారా ?

5. అసలు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి?

6. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆఖరి నిమిషంలో అర్ధాంతరంగా తన అభ్యర్థిని అన్నౌన్సు చేసింది??

7. ఎప్పుడూ గెలిచే తెరాస ఎందుకు అంత పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పర్యటనలు చేస్తుంది??? 

పై ప్రశ్నలన్నీ ఒకటైతే మాకు అడగాలనిపించిన మరికొన్ని ప్రశ్నలు ఇవే .... 

1.కేంద్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? రాష్ట్ర ప్రభుత్వ పని తీరు ఎలా ఉంది?

2.ప్రభుత్వాలు అందిస్తున్న అన్ని పతకాలు ప్రజలకు అందుతున్నాయా? మధ్యవర్తుల మధ్య మాయమౌతున్నాయా?

3.ఇన్ని సంవత్సరాల ఈ ప్రభుత్వాలు మళ్ళీ వచ్చే జనరల్ ఎన్నికలలో రావాలనుకుంటున్నారా ??? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ?

4. షర్మిల ఎవరు ?? షర్మిల తెలంగాణ ఎంట్రీ పై మీ అభిప్రాయమేమిటి ? 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle