newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

కేటీఆర్ ఒక ట్విట్టర్ పిట్ట మాత్రమే !

07-06-202107-06-2021 19:03:58 IST
2021-06-07T13:33:58.428Z07-06-2021 2021-06-07T13:32:52.307Z - - 22-06-2021

కేటీఆర్ ఒక ట్విట్టర్ పిట్ట మాత్రమే !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మంత్రి కేటీఆర్‌పై బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా నియంత్రణ చేతకాకనే  కేంద్రంపై విషం చిమ్ముతున్నారని, ప్రజల జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుకుంటోందని ఆమె ధ్వజమెత్తారు. వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం భారత్ బయోటెక్‌కు రాష్ట్ర ప్రభుత్వం సహాయనిరాకరణ చేస్తోందని తప్పుబట్టారు.

పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని, ట్విట్టర్‌కు మాత్రమే మంత్రిగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టెస్టుల విషయంలో ప్రభుత్వం అవాస్తవాలు చెప్తోందని ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. భూములు కబ్జా తప్ప టీఆర్ఎస్ ప్రభుయ ప్రజలకు చేసింది శూన్యమని డీకే అరుణ మండిపడ్డారు


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle