newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

రిలియన్స్ జియో తమ యూజర్లకి డబుల్ ధమాకా అందిస్తోంది

01-08-202101-08-2021 21:39:41 IST
2021-08-01T16:09:41.223Z01-08-2021 2021-08-01T16:09:36.062Z - - 05-12-2021

రిలియన్స్ జియో తమ యూజర్లకి డబుల్ ధమాకా అందిస్తోంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తమ కస్టమర్లకి డబుల్ ధమాకా అందించడానికి రెడీ అయ్యింది. ఇప్పటి వరకూ తమ కంపెనీ అందిస్తున్న టారిఫ్ లో అందిస్తున్న డేటా ని డబుల్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తాజా ఆఫర్‌ కింద రెండింతల ప్రయోజనాలు పొందవచ్చు. ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో రీఛార్జ్‌ ప్లాన్‌ తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశమని జియో తెలిపింది.

జియోఫోన్‌ వినియోగించే వారికి ఆరు రకాల ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై ఈ ప్రయోజనాలు అందుతాయి. ఉదాహరణకు జియో ఫోన్‌ను రూ.75తో రీఛార్జ్‌ చేసుకుంటే అంతే మొత్తంలో అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. రూ. 39, రూ. 69, రూ. 75, రూ. 125, రూ. 155, రూ. 185 రీఛార్జ్‌ ప్లాన్‌పై ఇది వర్తిస్తుంది. ఈ కొత్త ఆఫర్ కింద జియో కస్టమర్లు రూ. 69 ప్లాన్‌ తీసుకుంటే రోజుకు 0.5జీబీ డేటా వస్తుండగా అది 1జీబీ అవుతుంది. రూ. 75 ప్లాన్‌తో అపరిమిత వాయిస్‌ కాల్స్‌ 3 జీబీ డేటాను 28 రోజులు వినియోగించుకోవచ్చు. ఇప్పుడు 6జీబీ డేటా లభిస్తుంది. రూ. 125 ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై రోజుకు 0.5జీబీ డేటా 28 రోజుల పాటు లభిస్తుండగా 1జీబీ డేటాను పొందవచ్చు, రూ. 155 ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై అపరిమిత కాల్స్‌ 1జీబీ డేటా లభిస్తుండగా ఇక నుంచి రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. రూ. 185 ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై ఉచిత వాయిస్‌ కాల్స్‌ 2జీబీ డేటా లభిస్తుండగా ఇక నుంచి 4జీబీ డేటా పొందవచ్చు. ప్రస్తుతం దాటా వినియోగం ఎక్కువగా ఉండడంతో రిలియన్స్ జియో తమ కస్టమర్లకి మరింత లాభం చేకూర్చేందుకు ఈ ఆఫర్ ని తీసుకు వచ్చినట్లు తెలిపింది.

ట్విట్టర్ కొత్త సిఇఓ భారతీయుడు పరాగ్ అగర్వాల్ వార్షిక వేతనం ఎంతంటే..

ట్విట్టర్ కొత్త సిఇఓ భారతీయుడు పరాగ్ అగర్వాల్ వార్షిక వేతనం ఎంతంటే..

   30-11-2021

INS Vela: భారత నేవీలోకి ఐఎన్ఎస్ వేలా సబ్‌మెరైన్

INS Vela: భారత నేవీలోకి ఐఎన్ఎస్ వేలా సబ్‌మెరైన్

   25-11-2021

Halow Wifi:ఈ కొత్త వైఫై టెక్నాలజీ 1 కిమీ వరకు వస్తుంది

Halow Wifi:ఈ కొత్త వైఫై టెక్నాలజీ 1 కిమీ వరకు వస్తుంది

   20-11-2021

యాపిల్‌ను వెనక్కు నెట్టి మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అధిగమించింది

యాపిల్‌ను వెనక్కు నెట్టి మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అధిగమించింది

   28-10-2021

ఫేస్‌బుక్ టెస్ట్ నకిలీ వార్తలను కేవలం 21 రోజుల్లో ఫిల్టర్

ఫేస్‌బుక్ టెస్ట్ నకిలీ వార్తలను కేవలం 21 రోజుల్లో ఫిల్టర్

   25-10-2021

సెల్ ఫోన్ చార్జర్ తరహాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకురానున్న హీరో మోటోకార్ప్

సెల్ ఫోన్ చార్జర్ తరహాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకురానున్న హీరో మోటోకార్ప్

   21-10-2021

Facebook: ఫేస్‌బుక్‌ పేరు మార్చే పనిలో మార్క్ జుకర్‌బర్గ్

Facebook: ఫేస్‌బుక్‌ పేరు మార్చే పనిలో మార్క్ జుకర్‌బర్గ్

   20-10-2021

బెంజమిన్, డేవిడ్ మాక్‌మిలన్ లకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి

బెంజమిన్, డేవిడ్ మాక్‌మిలన్ లకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి

   06-10-2021

ఫేస్‌బుక్, వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. క్షమాపణలు కోరిన మార్క్ జూకర్‌బర్గ్

ఫేస్‌బుక్, వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. క్షమాపణలు కోరిన మార్క్ జూకర్‌బర్గ్

   05-10-2021

వినియోగదారులకి అందుబాటులో బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

వినియోగదారులకి అందుబాటులో బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

   23-09-2021

ఇంకా

Newssting

 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle