newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వ్యాక్సిన్ కు సిద్ధం కండి.. 18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

23-04-202123-04-2021 17:47:36 IST
Updated On 23-04-2021 18:12:12 ISTUpdated On 23-04-20212021-04-23T12:17:36.503Z23-04-2021 2021-04-23T11:10:13.728Z - 2021-04-23T12:42:12.573Z - 23-04-2021

వ్యాక్సిన్ కు సిద్ధం కండి..  18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సిన్ ను అందించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం (28వ తేదీ) నుంచి మొదలవుతుంది. CoWin పోర్టల్ ద్వారా 24వ తేదీ నుంచే ఈ రిజిస్ట్రేషన్ లను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 28 నుంచే మొదలవుతున్నప్పటికీ వాస్తవంగా టీకాలు వేసే కార్యక్రమం మే 1 వ తేదీ నుంచే ప్రారంభిస్తామని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మూడవ దశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది కోవిన్ వేదికతో పాటు ఆరోగ్యసేతు యాప్ ద్వారా కూడా ఈ రిజిస్ట్రేషన్ చేపడుతారు. కోవిన్ సైటుకు యాప్ లేనందున కేవలం రిజిస్ట్రేషన్లు మాత్రమే ఈ వెబ్ సైటు ద్వారా జరుగుతాయి. అయితే ఇందుకు సంబంధించి కేంద్రం స్పష్టమైన విధి విధానాలను జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.  

కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో వివిధ రకాల రేట్లు ఉండటం వల్ల ప్రజలు తీవ్ర స్థాయిలో ఆర్ధిక భారానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడుతాయని వివిధ రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రానికి స్పష్టం చేశాయి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తేనున్న తరుణంలో ఈ ధరల వ్యత్యాసంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మే ఒకటి లొగానే ఇందుకు సంబంధించి కేంద్రం సవరణ విధానాన్ని ప్రకటిస్తుందా లేక రేట్ల గందరగోళాన్ని రాష్ట్రాలపైనే రుద్దుతుందా అన్నది ఆసక్తి కలిగిస్తోంది. 

ఈ గందరగోళ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకున్న కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ ను జనాకర్షణకు వాడుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్ లో మే 5వ తేదీ నుంచి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కేంద్రం ధరలు తగ్గించకపోయినా రాష్ట్రాలే రాయితీలతో కోవిడ్ వ్యాక్సిన్ ను జనాలకు అందిస్తాయా అన్నది కూడా రాజకీయంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.  

ఒకే రేటు ఉండాలి: కాంగ్రెస్

దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ను అన్ని రాష్ట్రాలకు ఒకే రేటుతో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కోవిడ్ కేసులు రోజువారీగా తీవ్రమవుతున్నందున వ్యాక్సిన్ల నిర్వహణ ఆక్సిజన్ లభ్యత అన్నది ఆందోళనకరంగా మారిందని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలెట్ అన్నారు. ప్రాణవాయువు కోసం అల్లాడుతున్న రోగులకు దీన్ని అందించకపోతే ప్రజలకు సకాలంలో వ్యాక్సిన్లు వేయకపోతే భవిష్యత్ తరాలు క్షమించబోవని ఆయన అన్నారు. ఆక్సిజన్ తో పాటు ప్రాణాలు కాపాడే రెమ్డిసీవీర్ ఇంజక్షన్ ను తక్షణమే అందుబాటులోకి తేవాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఒకే రకమైన రేటుకు కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడం వల్ల సంక్లిష్ట పరిస్థితుల్లో వారిని ఆర్ధికంగా అడ్డుకున్నట్లు అవుతుందని ఆయన అన్నారు. 

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

   12-05-2021


టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

   09-05-2021


Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

   07-05-2021


కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

   03-05-2021


వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

   29-04-2021


OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

   26-04-2021


థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   22-04-2021


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle