newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

01-04-202101-04-2021 16:12:28 IST
2021-04-01T10:42:28.963Z01-04-2021 2021-04-01T02:50:18.301Z - - 14-05-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పాన్‌కార్డుతో ఆధార్‌ను అనుసంధానించే గడువును కేంద్రం మరోమారు పొడిగించింది.  ఈ గడువు మార్చి 31తో ముగియనుండగా తాజాగా జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లో సాంకేతికపరమైన ఇబ్బందుల కారణంగా పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించుకోలేకపోతున్నట్టు ఫిర్యాదులు రావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పొడిగించిన గడువులోపు పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని కోరింది. 

 పాన్, ఆధార్ అనుసంధానం గడువును ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు పొడిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో గతేడాది జులై 31 నుంచి 31 మార్చి 2021 వరకు పొడిగించింది. తాజాగా మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పాన్‌‌కార్డు, ఆధార్ కార్డులను లింక్ చేయకపోతే లేట్ ఫీజుకు కింద రూ. 1,000 వరకు కట్టాల్సి ఉంటుంది. ఫైనాన్స్‌‌ బిల్లులో సవరణలు చేయడం ద్వారా ఈ రూల్‌‌ను తీసుకొచ్చారు.

ఆధార్ కార్డు ఉంటే పది నిమిషాల్లోనే పాన్ కార్డును తీసుకోవచ్చు. పాన్ కార్డు తీసుకోవడానికి రెండు పేజీల్లో వివరాలు నింపి, ఆ తర్వాత కొద్ది రోజుల పాటు వేచి చూడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ ఆధార్ కార్డు ద్వారా కొద్ది నిమిషాల్లోనే ఆన్ లైన్ మార్గం ద్వారా పాన్ కార్డును తీసుకునే వెసులుబాటును ఆదాయపు పన్ను శాఖ కల్పించింది. ఈ-పాన్ కార్డ్ పొందేందుకు మీరు ఆధార్ కార్డు వివరాలు సమర్పించవలసి ఉంటుంది. ఆ తర్వాత KYC ప్రక్రియ పూర్తి చేసేందుకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. KYC పూర్తి చేసిన తర్వాత పాన్ కార్డు నెంబర్ వెంటనే జారీ చేస్తారు. అయితే ఇది ఈ-పాన్ నెంబర్. పీడీఎఫ్ రూపంలో దొరుకుతుంది. ఈ-పాన్ కార్డ్ వ్యాలిడ్ అయినప్పటికీ మీకు లామినేటెడ్ పాన్ కార్డు కావాలంటే మాత్రం రూ.50 చెల్లించవలసి ఉంటుంది. దీని ప్రింటెడ్ కాపీ కోసం ఆర్డర్ చేయవలసి ఉంటుంది.

ఇక పాన్‌ కార్డును ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానం చేయడం చాలా సులభం. ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్‌ వెబ్‌సైట్‌ ద్వారా సులువుగా లింక్ చేసుకోవచ్చు. ఇంతకు ముందే రిజిస్టర్ చేసుకున్న యూజర్లు ఇన్‌కం టాక్స్ ఇండియా ఇ ఫైలింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. యూజర్ ఐడీ, పాస్‌వర్డుతో లాగిన్ కావాలి. ప్రొఫైల్ సెట్టింగ్‌లోకి వెళ్తే 'లింక్‌ ఆధార్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. అడిగిన వివరాలు ఇచ్చి పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చు. 

ఇన్‌కం టాక్స్ ఇ ఫైలింగ్ వెబ్‌సైట్‌ లో కూడా ఆధార్ ను లింక్ చేసుకోవచ్చు. ఈ సైట్ ఓపెన్ చేసి, హోమ్‌పేజీలో ఎడమవైపు ఉన్న 'లింక్‌ఆధార్' అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. అక్కడ పాన్‌కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, మీ పేరు ఎంటర్ చేస్తే చాలు. లేదంటే ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయవచ్చు.

SMS ద్వారా కూడా పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. 567678 లేదా 56161 నెంబర్‌కి SMS పంపిస్తే లింక్ అయిపోతుందని ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ చెబుతోంది. UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 అంకెల ఆధార్ నెంబర్ రాసి స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ కార్డు నెంబర్ రాసి 567678 లేదా 56161 నెంబర్‌కి SMS చేయాలి.

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

   12-05-2021


టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

   09-05-2021


Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

   07-05-2021


కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

   03-05-2021


వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

   29-04-2021


OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

   26-04-2021


వ్యాక్సిన్ కు సిద్ధం కండి..  18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

వ్యాక్సిన్ కు సిద్ధం కండి.. 18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

   23-04-2021


థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   22-04-2021


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle