newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

22-04-202122-04-2021 16:50:11 IST
Updated On 22-04-2021 16:10:31 ISTUpdated On 22-04-20212021-04-22T11:20:11.593Z22-04-2021 2021-04-22T10:33:32.376Z - 2021-04-22T10:40:31.794Z - 22-04-2021

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇది వరకు ఎప్పుడో బంద్ లు చేసినప్పుడు సినిమా థియేటర్లు మూసివేసేవారు. అదీ ఒకరోజు లేదా రెండు రోజులు తప్పితే ఒక వారం. తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చిన థియేటర్లు మూతపడిన దాఖలాలే లేవు. ఇక థియేటర్లకు పోటీగా ఓటీటీలు వస్తే సినీ పరిశ్రమకు వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారు అంటూ థియేటర్ల వాళ్ళతో కలిసి ప్రొడ్యూసర్లు కూడా పెద్ద గొడవే చేసారు. 2020లో 6 నెలలు థియేటర్లు మూతపడ్డాయి. సినీ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు, సినీ పరిశ్రమ మొత్తం అతలా కుతలం ఐపోయింది. అప్పులు చేసి డబ్బులు పెట్టి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు సినిమాలు విడుదల చేసే అవకాశం లేక బిక్కు బిక్కు మంటూ చూసే రోజులలో మొత్తం సినీ పరిశ్రమను ఆదుకున్నది ఓటీటీ ఫ్లాట్ ఫామ్. మొత్తం ఆ ఆరు నెలలు ఆగిపోయిన సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు నిర్మాతలకు నష్టం రాకుండా డబ్బులు పెట్టి కొనుక్కుని ఓటీటీలో రిలీజ్ చేసుకున్నాయి.  

కొన్ని నెలల క్రితం థియేటర్లు తెరుచుకోవడంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ల స్పీడ్ కొంచెం తగ్గింది. మళ్ళీ షూటింగులు మొదలు అయ్యాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. మొదట సగం థియేటర్ జనం మాత్రమే అని ఆంక్షలు పెట్టినా చివరికి ఆ ఆంక్షలన్నీ సడలిపోయాయి. సినిమా థియేటర్లు హౌసుఫుల్ బోర్డులతో కళకళలాడాయి. అవి చూసి పెద్ద పెద్ద సినిమాలు సైతం షూటింగులు మొదలెట్టేసారు. కానీ  కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్ళీ థియేటర్లు మూయవలసిన పరిస్థితి వచ్చింది. ఇండియా మొత్తంగా రోజుకు 3 లక్షల పైనే కేసులు నమోదు అవుతుండడంతో థియేటర్లు, త్వరలోనే షూటింగులు ఆపవలసిన పరిస్థితి వచ్చేలా కనిపిస్తుంది. 

ఇక మళ్ళీ సినీ పరిశ్రమకి ఓటీటీల అవసరం వచ్చిందనే చెప్పుకోవచ్చు. డైరెక్ట్ గా చెప్పాలంటే ఇంక ఓటీటీలదే రాజ్యం. హాట్‌స్టార్, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లతో పాటూ జీ5, జియో, ఆహా వంటి మరిన్ని ఫ్లాట్ ఫామ్స్ కి ఇక పండగే. జనాలు నెమ్మదిగా ఓటీటీలకు అలవాటు పడిపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే థియేటర్లకు జనం రావడం కష్టమే, హౌస్ ఫుల్ బోర్డులు పెట్టడం ఇంకా కష్టమే అవుతుంది. ఎప్పటికే పెద్ద పెద్ద సినిమాలు కూడా వారం, పదిరోజులు ఆడే పరిస్థితి వచ్చేసింది. 

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

   12-05-2021


టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

   09-05-2021


Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

   07-05-2021


కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

   03-05-2021


వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

   29-04-2021


OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

   26-04-2021


వ్యాక్సిన్ కు సిద్ధం కండి..  18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

వ్యాక్సిన్ కు సిద్ధం కండి.. 18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

   23-04-2021


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle