ఎలక్ట్రిక్ బైక్ ల వరుస అగ్నిప్రమాదాలతో ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం
25-04-202225-04-2022 07:08:17 IST
2022-04-25T01:38:17.178Z25-04-2022 2022-04-25T01:38:05.803Z - - 27-05-2022

దేశ వ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. పలు కంపెనీల స్కూటర్లు అగ్ని ప్రమాదాలకు గురికావడంతో ఆయా కంపెనీలు సదరు ఎలక్ట్రిక్ స్కూటర్లను వెనక్కి పిలిచేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం తీసుకుంది. పేలుళ్ల నేపథ్యంలో 1441 యూనిట్ల ఒలా ఎలక్ట్రిక్ స్కూటర్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. మార్చి 26న పుణెలో జరిగిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్ని ప్రమాదం నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రమాదానికి గురైన స్కూటర్‌తో పాటు ఆ బ్యాచ్‌లో తయారైన అన్నింటినీ తనిఖీ చేయాలని నిర్ణయించామని తెలిపింది. అందులో భాగంగానే ఈ రీకాల్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. బ్యాటరీ వ్యవస్థలు, థర్మల్ వ్యవస్థలపై తమ సర్వీస్ ఇంజినీర్లు పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తారని ఓలా తెలిపింది. తమ స్కూటర్లలో అమర్చిన బ్యాటరీలు భారత ప్రమాణాలతో పాటు ఐరోపా ప్రమాణాలకు కూడా సరిపోతాయని పేర్కొంది. ఇటీవల పుణెలో జరిగిన ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ఘటనపై ఇంకా పూర్తిస్థాయి సమీక్ష కొనసాగుతున్నట్లు వెల్లడించింది.

భారతదేశంలో విడుదల కానున్న Motorola Edge 30
11-05-2022

అంగారకుడిపైకి మానవులు..!
09-05-2022

భారతదేశంలో రూ. 25,000లోపు ఉత్తమ స్మార్ట్ఫోన్లు..!
03-05-2022

'స్పేస్ బ్రిక్స్' ను అభివృద్ధి చేసిన ISRO
22-04-2022

స్పేస్ కమ్యూనికేషన్స్ కాంట్రాక్టులను దక్కించుకున్న Amazon, SpaceX ..!
21-04-2022

నాకు ఇల్లు లేదు : ఎలాన్ మస్క్
20-04-2022

ఇండియా మార్కెట్ లో మైక్రోమ్యాక్స్ ఇన్ 2C స్మార్ట్‌ఫోన్
18-04-2022

యాపిల్ IPhone 14 లో సరికొత్త ఫీచర్ ..!
17-04-2022

Xiaomi ఇండియా మాజీ ఎండీ కి ED సమన్లు
13-04-2022

హైదరాబాద్ లో దేశంలో మొట్టమొదటి 5 జి నెట్ వర్క్ టెస్టింగ్
23-02-2022
ఇంకా