newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ ఫీచర్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

07-08-202107-08-2021 20:53:30 IST
2021-08-07T15:23:30.216Z07-08-2021 2021-08-07T15:23:07.077Z - - 10-08-2022

ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ ఫీచర్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఓలా సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 న లాంచ్‌ చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ ఫీచర్ లని విడతల మాదిరిగా సోషల్ మీడియాలో వివరిస్తూ కస్టమర్లలో ఆసక్తిని పెంచుతున్నాడు సీఈఓ భవీష్ అగర్వాల్. దీంతో వరల్డ్‌ వైడ్‌గా ఓలా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

అయితే ఓలా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ప్రి-బుకింగ్స్‌ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే లక్షకుపైగా బైక్‌లు బుక్‌ అయ్యి పెను సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా  తాజాగా భవీష్‌ అగర్వాల్‌ ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫీచర్లును రిలీజ్‌ చేశాడు. ఈ స్కూటర్లు ఎలక్ట్రిక్‌ బైక్ల  విభాగంలో మరో సంచలనాన్ని సృష్టించనున్నాయి. ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ముందుకే కాదు వెనక్కి కూడా ప్రయాణించగలవని భవీష్‌ అగర్వాల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నారు. రివర్స్‌ ఫీచర్‌తో పాటుగా కీ లెస్‌ స్టార్టింగ్‌ను ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ సపోర్ట్‌ చేయనుంది. స్మార్ట్‌ఫోన్‌లోని అప్లికేషన్ సహాయంతో స్కూటర్‌ను యాక్సెస్ చేయవచ్చును. స్కూటర్‌లో బెస్ట్-ఇన్-సెగ్మెంట్ బూట్ స్పేస్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్‌  స్కూటర్‌ సెగ్మెంట్‌-ఫస్ట్‌ లేదా సెగ్మెంట్‌ బెస్ట్‌గా నిలుస్తోందని కంపెనీ తెలుపుతుంది. దీంతో ఓలా స్కూటర్ ని సొంతం చేసుకోవాలని చాలా మంది భారతీయులు ఉవ్విళ్లూరుతున్నారు. 


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle