newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

సంచలనం సృష్టిస్తున్న ఓల ఎలక్ట్రిక్ స్కూటర్ వేగం..

29-07-202129-07-2021 16:13:11 IST
2021-07-29T10:43:11.698Z29-07-2021 2021-07-29T10:42:39.629Z - - 05-12-2021

సంచలనం సృష్టిస్తున్న ఓల ఎలక్ట్రిక్ స్కూటర్ వేగం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పెట్రోల్ తో నడిచే 125 సిసి, 150 సిసి, 200 సిసి గంటకి వంద కిలోమీటర్ల వేగంతో రాడ్లపై రయ్యున దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకి అంత సామర్ధ్యం లేదని, ఈ వాహనాలు గంటకి నలభై, యాభై కిలోమీటర్ల వరకే ఉంటుందని భావించిన వారికి ఓలా స్కూటర్ సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ షాకింగ్ న్యూస్ తెలిపారు. 

గత కొద్ది కాలంగా ఓల స్కూటర్‌కి సంబధించిన కీలక సమాచారాన్ని ఒక్కొక్కటిగా సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకుంటున్నారు. తాజాగా ఓలా స​‍్కూటర్‌ టాప్‌ స్పీడ్‌ ఎంత ఉండాలని మీరు కోరుకుంటున్నారో చెప్పండి అంటూ ట్విట్టర్‌ వేదికగా ఓ ప్రశ్న అడిగారు. అలాగే ఆప్ఫన్లుగా గంటకి 80 కి,మీ, 90 కి,మీ, 100కు పైగా కి.మీలతో పాటు స్పీడ్‌తో పని లేదన్నట్టుగా నాలుగు ఆప్ఫన్లు ఇచ్చారు. ఈ పోల్‌లో సగం మంది వందకు పైగా స్పీడ్‌ కావాలంటూ సమాధానం ఇచ్చారు. అయితే  ఓలా స్కూటర్‌ గరిష్ట వేగం గంటకు వంద కిలోమీటర్లకు పైగానే ఉంటుందని తెలిపి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. 

ఇటీవల ఓల ప్రీ బుకింగ్స్‌లో ఏకంగా లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అంతే కాదు ఈ స్కూటర్ పది రంగులలో అందుబాటులో ఉంటుందని, ప్రయాణీకులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు తగ్గట్టు డిజైన్ చేసినట్టు ఆయన తెలిపారు. ఇంకా మార్కెట్ లో విడుదల కాకముందే ఓలా అన్ని విషయాల్లోనూ రికార్డు సృష్టిస్తోంది.

ట్విట్టర్ కొత్త సిఇఓ భారతీయుడు పరాగ్ అగర్వాల్ వార్షిక వేతనం ఎంతంటే..

ట్విట్టర్ కొత్త సిఇఓ భారతీయుడు పరాగ్ అగర్వాల్ వార్షిక వేతనం ఎంతంటే..

   30-11-2021


INS Vela: భారత నేవీలోకి ఐఎన్ఎస్ వేలా సబ్‌మెరైన్

INS Vela: భారత నేవీలోకి ఐఎన్ఎస్ వేలా సబ్‌మెరైన్

   25-11-2021


Halow Wifi:ఈ కొత్త వైఫై టెక్నాలజీ 1 కిమీ వరకు వస్తుంది

Halow Wifi:ఈ కొత్త వైఫై టెక్నాలజీ 1 కిమీ వరకు వస్తుంది

   20-11-2021


యాపిల్‌ను వెనక్కు నెట్టి మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అధిగమించింది

యాపిల్‌ను వెనక్కు నెట్టి మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అధిగమించింది

   28-10-2021


ఫేస్‌బుక్ టెస్ట్ నకిలీ వార్తలను కేవలం 21 రోజుల్లో ఫిల్టర్

ఫేస్‌బుక్ టెస్ట్ నకిలీ వార్తలను కేవలం 21 రోజుల్లో ఫిల్టర్

   25-10-2021


సెల్ ఫోన్ చార్జర్ తరహాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకురానున్న హీరో మోటోకార్ప్

సెల్ ఫోన్ చార్జర్ తరహాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకురానున్న హీరో మోటోకార్ప్

   21-10-2021


Facebook: ఫేస్‌బుక్‌ పేరు మార్చే పనిలో మార్క్ జుకర్‌బర్గ్

Facebook: ఫేస్‌బుక్‌ పేరు మార్చే పనిలో మార్క్ జుకర్‌బర్గ్

   20-10-2021


బెంజమిన్, డేవిడ్ మాక్‌మిలన్ లకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి

బెంజమిన్, డేవిడ్ మాక్‌మిలన్ లకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి

   06-10-2021


ఫేస్‌బుక్, వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. క్షమాపణలు కోరిన మార్క్ జూకర్‌బర్గ్

ఫేస్‌బుక్, వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. క్షమాపణలు కోరిన మార్క్ జూకర్‌బర్గ్

   05-10-2021


వినియోగదారులకి అందుబాటులో బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

వినియోగదారులకి అందుబాటులో బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

   23-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle