newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

హోండా 6జీ మోడల్‌తో పాటు డియోలో కొత్త మోడల్స్‌ని పరిచయం చేసిన హోండా కంపెనీ

19-09-202119-09-2021 09:02:03 IST
2021-09-19T03:32:03.951Z19-09-2021 2021-09-19T03:26:35.606Z - - 17-10-2021

హోండా 6జీ మోడల్‌తో పాటు డియోలో కొత్త మోడల్స్‌ని పరిచయం చేసిన హోండా కంపెనీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హోండా కంపెనీ నుండి వెలువడిన హోండా యాక్టివా స్కూటర్ కి మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా హోండా యాక్టివా స్కూటర్ ని సరికొత్త రూపంలో తీసుకువస్తోంది హోండా కంపెనీ. సక్సెస్‌ ఫుల్‌ మోడల్‌ యాక్టివాతో పాటు డియో నుంచి కొత్త ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్లు ఈ దసరా పండగకి మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు హోండా కంపెనీ సిద్దపడుతుంది. 

ఇటీవల హోండా మోటార్‌ సైకిల్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తమ కంపెనీ రాబోతున్న కొత్త మోడళ్లకు సంబంధించి డాక్యుమెంట్లను ఆర్టీఏ కార్యాలయం ఢిల్లీలో సమర్పించింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం హోండా 6జీ మోడల్‌తో పాటు డియోలో కొత్త మోడల్స్‌ని మార్కెట్‌లో రిలీజ్‌ చేయబోతున్నట్టు పేర్కొంది. హోండా యాక్టివాకు సంబంధించి మార్కెట్‌లో ప్రస్తుతం 5జీ వెర్షన్‌ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుండగా తాజాగా 6జీ వెర్షన్‌ను తెచ్చేందుకు హోండా సిద్ధమైంది. హోండా 6జీ, హోండా 6జీ ఎల్‌ఈడీ వెర్షన్లలో రెండు స్కూటర్లు మార్కెట్‌లోకి రాబోతున్నట్టు హోండా డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం హోండా యాక్టివాకు స్టీల్‌ వీల్స్‌ ఉండగా 6జీ నుంచి ఎల్లాయ్‌ వీల్స్‌ని పరిచయం చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే హోండా త్వరలో మార్కెట్‌లోకి తేబోతున్న 6జీ యాక్టివా, డియో మోడల్స్‌ రెండింటి ఇంజన్‌ సామర్థ్యం 109.51 సీసీ సింగిల్‌ సిలిండర్‌గా ఉంది. యాక్టివా 5జీ 7.68 హెచ్‌పీతో 8,000 ఆర్‌పీఎం శక్తిని విడుదల చేయనుంది. ఇక డియోకు సంబంధించి 7.65 హెచ్‌పీతో 8,000 ఆర్‌పీఎంని రిలీజ్‌ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. 

బెంజమిన్, డేవిడ్ మాక్‌మిలన్ లకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి

బెంజమిన్, డేవిడ్ మాక్‌మిలన్ లకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి

   06-10-2021


ఫేస్‌బుక్, వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. క్షమాపణలు కోరిన మార్క్ జూకర్‌బర్గ్

ఫేస్‌బుక్, వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. క్షమాపణలు కోరిన మార్క్ జూకర్‌బర్గ్

   05-10-2021


వినియోగదారులకి అందుబాటులో బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

వినియోగదారులకి అందుబాటులో బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

   23-09-2021


భారతదేశంలో ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి

భారతదేశంలో ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి

   20-09-2021


కాలింగ్, ఫోటోలు మరియు నావిగేషన్ ఫీచర్లతో షియోమి స్మార్ట్ గ్లాసెస్

కాలింగ్, ఫోటోలు మరియు నావిగేషన్ ఫీచర్లతో షియోమి స్మార్ట్ గ్లాసెస్

   14-09-2021


బ్యాటరితో కూడా హీరో స్ప్లెండ‌ర్ బైక్ నడుప వచ్చు..

బ్యాటరితో కూడా హీరో స్ప్లెండ‌ర్ బైక్ నడుప వచ్చు..

   07-09-2021


అమెజాన్ లో ఉద్యోగాల జాతర.. ప్రపంచ వ్యాప్తంగా 55,000 ఉద్యోగాలు

అమెజాన్ లో ఉద్యోగాల జాతర.. ప్రపంచ వ్యాప్తంగా 55,000 ఉద్యోగాలు

   02-09-2021


మార్కెట్లోకి మరో కొత్త ఈ స్కూటర్‌.. ఇది చాలా స్మార్ట్ సుమీ..

మార్కెట్లోకి మరో కొత్త ఈ స్కూటర్‌.. ఇది చాలా స్మార్ట్ సుమీ..

   25-08-2021


గుడ్ న్యూస్... ఇకపై వ్యాక్సిన్ స్లాట్‌లను ఇప్పుడు వాట్సాప్‌లో బుక్ చేసుకోవచ్చు

గుడ్ న్యూస్... ఇకపై వ్యాక్సిన్ స్లాట్‌లను ఇప్పుడు వాట్సాప్‌లో బుక్ చేసుకోవచ్చు

   24-08-2021


త్వరలో ఓలా ఎలక్ట్రిక్‌ కార్లు కూడా.. భవీష్‌ అగర్వాల్‌ వెల్లడి..

త్వరలో ఓలా ఎలక్ట్రిక్‌ కార్లు కూడా.. భవీష్‌ అగర్వాల్‌ వెల్లడి..

   22-08-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle