newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

07-04-202107-04-2021 22:14:35 IST
Updated On 07-04-2021 17:31:38 ISTUpdated On 07-04-20212021-04-07T16:44:35.985Z07-04-2021 2021-04-07T11:42:22.028Z - 2021-04-07T12:01:38.976Z - 07-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇటీవల 50 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారం ఆన్‌లైన్‌లో లీక్‌ అయిందనే వార్తలు గుప్పుమన్నాయి. వీరిలో దాదాపు 6 కోట్ల మంది భారతీయుల వివరాలు కూడా ఉన్నాయని కూడా అంటున్నారు. ఫేస్‌బుక్‌ సహవ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సైతం తన సమాచారాన్ని కాపాడుకోలేకపోయారని టెక్ విశ్లేషకులు అంటున్నారు. లీక్‌ అయిన వివరాల్లో జుకర్‌బర్గ్‌ వివరాలు కూడా ఉన్నాయని.. ఆయన ఫోన్‌నెంబర్‌, పుట్టిన తేదీ, ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతం, వివాహానికి సంబంధించిన సమాచారం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది.

జుకర్‌బర్గ్‌ ఫోన్‌నెంబర్‌గా చెబుతున్న నెంబర్‌తో సెర్చ్‌ చేయగా.. ఆయన మరో మెసేజింగ్‌ యాప్‌ సిగ్నల్ ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఈ విషయాన్ని ఓ సెక్యూరిటీ రీసెర్చర్‌ డేవ్‌ వాకర్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఫేస్‌బుక్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న వాట్సాప్‌కి పోటీగా సిగ్నల్‌ యాప్‌ వచ్చిన విషయం తెలిసిందేవచ్చింది. పైగా వాట్సాప్‌లో వ్యక్తిగత గోప్యతపై ఇటీవల అనేక అనుమానాలు వ్యక్తమైన సమయంలో సిగ్నల్‌ ను విపరీతంగా డౌన్ లోడ్ చేశారు. దీంతో వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు సిగ్నల్‌ని భావిస్తున్నట్లు తేలింది.

50 కోట్ల యూజర్ల ఫోన్ నంబర్లను అమ్మేసిన ఫేస్ బుక్ 

ఆ ఫోన్‌నెంబర్‌ జుకర్‌బర్గ్‌దే అనిగానీ, ఆయన సిగ్నల్‌లో ఉన్నారనిగానీ ఇప్పటి వరకు ఇటు జుకర్‌బర్గ్‌ లేదా సిగ్నల్‌ యాజమాన్యం చెప్పలేదు. ఆయనకు సిగ్నల్ యాప్ లో ఖాతా ఉందని, ఆయన ఫోన్ నెంబర్ కూడా ఆన్ లైన్ లో పెట్టారని హ్యాకింగ్ భద్రతా పరిశోధకుడు వెల్లడిస్తేనే తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా 533 మిలియన్ల ఫేస్ బుక్ ఖాతాదారు వ్యక్తిగత వివరాలు లీకేజీకి గురయ్యాయి. ఈ నెంబర్లకు సంబంధించిన వివరాలు డేటాబేస్ హాక్టర్ల ఫోరంలో పోస్టు చేసేశారు. బాధితుల్లో ఫేస్ బుక్ సహా వ్యవస్థాపకులు డస్టిన్ మొస్కోవిట్జ్, క్రిస్ హ్యూస్ కూడా ఉన్నారు. జుకర్‌బర్గ్‌ కూడా సమాచార గోప్యతను కోరుకుంటున్నారని, తన సొంత సంస్థ అయిన ఫేస్‌బుక్‌లో సమాచార భద్రత...ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్కిప్షన్‌ లేనందున సిగ్నల్‌ యాప్‌ను వినియోగిస్తున్నారంటూ భద్రతా నిపుణుడు దేవ్‌వాకర్‌ తెలిపారు. చూస్తుంటే రాబోయే కాలంలో ఫేస్ బుక్, వాట్సాప్ లకు గడ్డుకాలం ఎదురయ్యే అవకాశం ఉంది. 

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

   12-05-2021


టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

   09-05-2021


Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

   07-05-2021


కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

   03-05-2021


వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

   29-04-2021


OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

   26-04-2021


వ్యాక్సిన్ కు సిద్ధం కండి..  18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

వ్యాక్సిన్ కు సిద్ధం కండి.. 18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

   23-04-2021


థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   22-04-2021


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle