newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

ఓలాకి ఇంత డిమాండా.. ఊహించలేకపోయిన కంపెనీ.. బ్లాక్ అయిన వెబ్ సైట్

16-07-202116-07-2021 20:21:13 IST
2021-07-16T14:51:13.733Z16-07-2021 2021-07-16T14:48:55.576Z - - 25-07-2021

ఓలాకి ఇంత డిమాండా.. ఊహించలేకపోయిన కంపెనీ.. బ్లాక్ అయిన వెబ్ సైట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఓలా ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్ల ని రూ.499కి బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటలలోనే సైట్ బ్లాక్ అయిపొయింది. త్వరలో మార్కెట్ లోకి తీసుకురానున్న ఓలా స్కూటర్ ని రూ.499కి బుకింగ్స్ ఓపెన్ చేశారు. దీంతో కస్టమర్ల నుండి విపరీతమైన డిమాండ్ రావడంతో కంపెనీ సైట్ లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించిన వినియోగదారులు సమస్యలు ఎదుర్కొన్నారు. దీని గురుంచి ఓలా కో-ఫౌండర్ భవిష్ అగర్వాల్ ట్విట్టర్ లో క్షమాపణ లు కోరారు. పోర్టల్ లో లాగిన్ అయ్యేందుకు ఒకేసారి ఎక్కువ మంది ప్రయత్నించడంతో సైట్ బ్లాక్ అయ్యినట్లు అగర్వాల్ పేర్కొన్నారు.     

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదట్లో సమస్యలను ఎదుర్కొన్న వారికి క్షమాపణలు! మేము ఈ డిమాండ్ ను ఊహించలేదు. వెబ్ సైట్ లో తగినంత స్కేలబిలిటీని ప్లాన్ చేయలేదు. అన్నీ ఇప్పుడు పరిష్కరించబడ్డాయి" అని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ రాశారు. అయితే వినియోగదారుల నుండి ఇంత డిమాండ్ అన్నది నిజంగానే ఓలా ఊహించనిది కాదు. తమ ప్రోడక్ట్ ని మార్కెట్ చేసుకోవడానికి ఓలా ఈ స్టంట్ చేసిందని నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. కాగా తమిళనాడులో ఈ ఫెసిలిటీలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తున్నారు. ఈ ఫెసిలిటీ సెంటర్ ప్రపంచంలో ఉన్న ఫెసిలిటీ సెంటర్లు కంటే పెద్దదని, ఇందులో ఏడాదికి ఒక కోటి యూనిట్లను తయారు చేసే సామర్ధ్యం ఉందని, ఇక్కడి నుంచి లాటిన్ అమెరికా, యుకె, న్యూజిలాండ్, ఇతరుల మార్కెట్లకు ఎగుమతులు చేయాలని ఓలా కంపెనీ చూస్తున్నారు. ఇందువల్లనే ముందుగా వినియోగదారులని ఆకట్టుకోవాలని ఈ ఆఫర్ ని ప్రవేశపెట్టారని ప్రత్యర్ధి కంపెనీలు అంటున్నాయి. 

JioFiber: కస్టమర్లకు జియో గుడ్ న్యూస్.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!

JioFiber: కస్టమర్లకు జియో గుడ్ న్యూస్.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!

   22-07-2021


వాట్సాప్ 2 మిలియన్ భారతీయ ఖాతాలను నిషేధించింది, నెటిజన్లు మీమ్స్ తో స్పందిస్తున్నారు

వాట్సాప్ 2 మిలియన్ భారతీయ ఖాతాలను నిషేధించింది, నెటిజన్లు మీమ్స్ తో స్పందిస్తున్నారు

   17-07-2021


డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కాపాడటానికి కొత్త ఐటి నియమాలు: కేంద్రం

డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కాపాడటానికి కొత్త ఐటి నియమాలు: కేంద్రం

   13-07-2021


అమెజాన్ వెబ్సైట్ లో అంతరాయం.. తీవ్రంగా ఇబ్బంది పడ్డ కస్టమర్లు

అమెజాన్ వెబ్సైట్ లో అంతరాయం.. తీవ్రంగా ఇబ్బంది పడ్డ కస్టమర్లు

   12-07-2021


అంతరిక్షంలోకి మన తెలుగమ్మాయి..

అంతరిక్షంలోకి మన తెలుగమ్మాయి..

   11-07-2021


ఈ బజాజ్ స్కూటర్, ఇంకా మార్కెట్ లోకి రానేలేదు అయినా..

ఈ బజాజ్ స్కూటర్, ఇంకా మార్కెట్ లోకి రానేలేదు అయినా..

   11-07-2021


రూ. 10 వేలకే రియల్‌ మీ 5 జీ మొబైల్స్

రూ. 10 వేలకే రియల్‌ మీ 5 జీ మొబైల్స్

   07-07-2021


అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బేజోస్‌ రాజీనామా.. ఆయన స్థానంలో ఆండీ జస్సీ

అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బేజోస్‌ రాజీనామా.. ఆయన స్థానంలో ఆండీ జస్సీ

   05-07-2021


సోషల్ మీడియా డే 2021: చరిత్ర మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి

సోషల్ మీడియా డే 2021: చరిత్ర మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి

   30-06-2021


బిఎమ్‌డబ్ల్యూ M340i ఎక్స్‌డ్రైవ్‌ భారతదేశంలో మరోసారి బుకింగ్ తెరిచింది

బిఎమ్‌డబ్ల్యూ M340i ఎక్స్‌డ్రైవ్‌ భారతదేశంలో మరోసారి బుకింగ్ తెరిచింది

   29-06-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle