newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

నాకు ఇల్లు లేదు : ఎలాన్ మస్క్

20-04-202220-04-2022 17:56:58 IST
Updated On 20-04-2022 17:59:25 ISTUpdated On 20-04-20222022-04-20T12:26:58.296Z20-04-2022 2022-04-20T12:26:53.154Z - 2022-04-20T12:29:25.197Z - 20-04-2022

నాకు ఇల్లు లేదు : ఎలాన్ మస్క్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎలాన్ మస్క్ - ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు - తనకు ప్రస్తుతం ఇల్లు లేదని, స్నేహితుల విడి బెడ్‌రూమ్‌లలో నిద్రిస్తున్నానని చెప్పాడు.  ఇటీవల ఒక  ఇంటర్వ్యూలో మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు. 

 

"నేను టెస్లా ఇంజనీరింగ్‌ కంపెనీ వ్యవహారాల్లో భాగంగా ఎక్కువగా  బే ఏరియాకు ప్రయాణిస్తే, నేను ప్రాథమికంగా స్నేహితుల ఇళ్ళల్లో  విడిది  బెడ్‌రూమ్‌లలో నిద్రిస్తున్నాను . నాకు దూరాలవాట్లు  లేవు ,అలాగే ,  నేను నా పని నుండి  సెలవులు తీసుకోను," అన్నారాయన. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపద అసమానత మరియు బిలియనీర్లు ఖర్చు చేసిన డబ్బు గురించి అడిగిన ప్రశ్నకు మస్క్ ఇలా స్పందించారు. 

 

" నేను వ్యక్తిగత వినియోగంలో సంవత్సరానికి బిలియన్ల డాలర్లు వినియోగిస్తే అది చాలా సమస్యాత్మకంగా ఉంటుంది.అయితే , ఇది నా వ్యక్తిగత వినియోగం ఎక్కువగా ఉన్నట్లు కాదు.నేను విమానాన్ని ఉపయోగించకపోతే, నేను చేసే పనిలో అంతరాయం తో పాటుగా నా పని సమయం తక్కువ గంటలు ఉంటుంది." 

 

ఫోర్బ్స్ ప్రకారం, మస్క్ నికర ఆస్తుల విలువ $269.5 బిలియన్లు. మస్క్ ప్రస్తుతం ట్విట్టర్‌లో 9.1 శాతం వాటాను కలిగి ఉన్నారు మరియు ఆ కంపెనీ యొక్క రెండవ అతిపెద్ద వాటాదారు. ఈ వారం ప్రారంభంలో, మస్క్ కంపెనీని $43 బిలియన్లకు కొనుగోలు చేయడానికి ప్రతిపాదన పెట్టి వార్తల్లో నిలిచాడు.


Aravind


NewsSting Team
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle