newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

మార్కెట్లోకి మరో కొత్త ఈ స్కూటర్‌.. ఇది చాలా స్మార్ట్ సుమీ..

25-08-202125-08-2021 20:32:06 IST
2021-08-25T15:02:06.536Z25-08-2021 2021-08-25T15:02:02.174Z - - 10-08-2022

మార్కెట్లోకి మరో కొత్త ఈ స్కూటర్‌.. ఇది చాలా స్మార్ట్ సుమీ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపధ్యంలో భారతదేశం లోని మధ్యతరగతి ప్రజలు ఎలక్ట్రిక్ స్కూటర్ లని కొనుగోలు చేయాడానికి అమితాసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపధ్యంలో ఓలా కంపెనీ స్కూటర్లు రికార్డు స్థాయిలో అమ్ముడయిన విషయం తెలిసిందే. తాజాగా స్కూటర్ ల జాబితాలో ఈబైక్ గో తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ చేరింది. దీనిని రగ్డ్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇది రెండు వేరియెంట్లలో లభిస్తుంది. మొదటి రగ్డ్ జీ1 ధర రూ.84,999గా ఉంటే, రగ్డ్ జీ1 ప్లస్ ధర రూ.1,04,999గా ఉంది. నవంబర్ 2021 మొదటి వారం నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈబైక్ గో రగ్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై వివిధ రాష్ట్రాల సబ్సిడీ కూడా లభిస్తుంది. ఈబైక్ గో రగ్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3కెడబ్ల్యు మోటార్ ఉంది. ఇది దాని డ్యూయల్ 2కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ ద్వారా గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదు. 

ఇక ఇది సున్నా శాతం నుంచి ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారు 3.5 గంటలు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే 160 కి.మీ. వెళ్లగలదు అని ఈబైక్ గో పేర్కొంది. ఇది స్టీల్ ఫ్రేమ్ తో క్రెడిల్ ఛాసీస్ పై నిర్మించబడింది. సుమారు 30 లీటర్ల స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిలో 12 బిల్ట్ ఇన్ స్మార్ట్ సెన్సార్లు ఉన్నాయి. వీటి ద్వారా ఎలక్ట్రిక్ బైక్ లాక్, అన్ లాక్ చేయవచ్చు. దీనిలో యాంటీ థెఫ్ట్ ఫీచర్ కూడా ఉంది. ఈ యాంటీ థెఫ్ట్ ఫీచర్ వల్ల అదనపు భద్రత లభిస్తుంది. ఈ స్కూటర్ నుఎవరైనా టచ్ చేస్తే ఆటోమెటిక్ గా అలారం మొగుతుంది. దీనిలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఫ్లీట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఉంది. ఈ స్కూటర్‌ను భారతదేశంలోనే తయారు చేశారు. ఈ స్కూటర్ ఛాసిస్ 7 సంవత్సరాల వారెంటీతో వస్తుంది. ప్రస్తుతం ఇండియాలో మూడు కంపెనీల ఈ స్కూటర్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. దీంతో కస్టమర్లు సైతం ఈ స్కూటర్ లని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తుండడం విశేషం.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle