newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

29-04-202129-04-2021 12:31:51 IST
Updated On 29-04-2021 14:41:06 ISTUpdated On 29-04-20212021-04-29T07:01:51.164Z29-04-2021 2021-04-29T03:33:28.389Z - 2021-04-29T09:11:06.400Z - 29-04-2021

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మే 1 నుండి భారతదేశంలో 18 ఏళ్లు నిండిన వారికి టీకా ఇచ్చే ప్రక్రియ ప్రారంభం కానుంది. టీకా కావాలని భావించే వారు కొవిన్ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ, ఆరోగ్య శాఖ కోరింది. బుధవారం సాయంత్రం 4 గంటల తరువాత వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ ప్రారంభం అయ్యింది. 

వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కాగానే నిమిషానికి 27 లక్షల హిట్స్ రావడంతో, వెబ్ సైట్ స్తంభించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆపై సమస్య పరిష్కారం అయిందని, రిజిస్టర్ చేయించుకున్న వారికి రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో స్లాట్ల అందుబాటును బట్టి, సమాచారం ఇచ్చి టీకాలు వేయిస్తామని తెలిపాయి. 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ తప్పనిసరి చేయడంతో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌  కోసం ప్రజలు ఒక్కసారిగా ప్రయత్నించడంతో కోవిన్‌ పోర్టల్‌ క్రాష్‌ అయ్యింది. ఆరోగ్య సేతు, ఉమంగ్‌ యాప్‌లోనూ సర్వర్ క్రాష్ అయ్యింది. 

రాష్ట్రాలు, ప్రైవేటు టీకా కేంద్రాలు అందుబాటులో ఉంచిన స్లాట్ల ఆధారంగా టీకా సమయాన్ని కేటాయిస్తామని అధికారులు తెలిపారు. గంటల వ్యవధిలోనే 1.33 కోట్ల మంది రిజిస్టర్ చేయించుకున్నారు. మరిన్ని అపాయింట్ మెంట్ స్లాట్లకు అవకాశం ఉందని, ఒకవేళ స్లాట్లు ఖాళీగా లేవని వెబ్ సైట్ లో కనిపిస్తే, కొంతకాలం తరువాత మరోసారి చెక్ చేసుకోవాలని, టీకా కావాలని భావించే వారు పరిస్థితిని అర్థం చేసుకుని, ఓపికతో ఉండాలని ప్రభుత్వం చెబుతోంది.  శనివారం నాడు వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని తెలిపిన అధికారులు, రిజిస్ట్రేషన్స్ ను ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చని తెలిపారు. సీరమ్ తయారు చేస్తున్న కొవిషీల్డ్ తో పాటు, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవాగ్జిన్ ను అందిస్తున్నారు.

18 ఏళ్లు నిండిన వారికి ప్రైవేటు, రాష్ట్ర ప్రభుత్వ కేంద్రాలు అందుబాటులో ఉంచే స్లాట్ల లభ్యత ఆధారంగా అపాయింట్‌మెంట్‌లు లభిస్తాయి. వ్యాక్సిన్లు అందుబాటులో ఉండి మే 1 నుంచి టీకాలు వేయడానికి సిద్ధంగా ఉన్న కేంద్రాల ఆధారంగా మాత్రమే ప్రజలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వనున్నారు.

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

   12-05-2021


టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

   09-05-2021


Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

   07-05-2021


కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

   03-05-2021


OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

   26-04-2021


వ్యాక్సిన్ కు సిద్ధం కండి..  18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

వ్యాక్సిన్ కు సిద్ధం కండి.. 18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

   23-04-2021


థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   22-04-2021


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle