newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

03-05-202103-05-2021 20:09:56 IST
2021-05-03T14:39:56.752Z03-05-2021 2021-05-03T14:38:41.015Z - - 14-05-2021

కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణాలో వ్యాక్సిన్లకు సంబంధించి ప్రజారోగ్య డైరెక్టర్ జి. శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే వ్యాక్సిన్లు ఇస్తున్నామని అది కూడా కోవిన్ యాప్ లో నమోదు చేసుకున్న వారికి మాత్రమే అందిస్తున్నామని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ప్రతి కేంద్రంలోనూ రోజుకు 200 మందికి టీకాలు వేస్తున్నామని, నగర పాలక సంస్థ పరిధిలో లేని మీగతా కేంద్రాలకు రోజుకు 100 మందికి టీకాలు అందిస్తున్నామని చెప్పారు. 18 సంవత్సరాలు దాటిన వారికి టీకాలు వేసే కార్యక్రమం దేశమంతటా మే ఒకటవ తేదీనే మొదలైనప్పటికీ వ్యాక్సిన్ల కొరత కారణంగా రాష్ట్రంలో ఇది ప్రారంభం కాలేదని ఆయన తెలిపారు. దేశంలో అనేక రాష్ట్రాలలో ఈ వ్యాక్సిన్ కొరత ఉన్నందున అనుకున్న ప్రకారం చాలా ప్రభుత్వాలు దీన్ని ప్రారంభించలేదు. అయితే 18 సంవత్సరాలు దాటిన వారికి ముమ్మరంగా ఎప్పుడు టీకాల ప్రక్రియ కొనసాగుతుంది? అందుకు జారుతున్న ఏర్పాట్ల విషయంలో స్పష్టత కనిపించడం లేదు. రాష్ట్రంలో కోవిడ్ వైరస్ ఇంకా ఉధృతంగా ఉండటం వల్ల  మరణాల రేటు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం నియంత్రణ చర్యలను గట్టిగా అమలు చేస్తోంది.

రాష్ట్ర హైకోర్టు కూడా ఇందుకు సంబంధించి ప్రభుత్వాన్ని గట్టిగానే ఆదేశించిన మరో వారం పాటు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగించాల్సి వచ్చింది.  ఇక రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లోనూ ఇటు పడకలూ, అటు ఆక్సిజన్ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆదివారం ఆర్ధిక మంత్రి హరీష్ రావు కోవిడ్ పరిస్థితిపై సమీక్ష జరిపిన నేపథ్యంలో సోమవారం పటాన్చెరువు, జోగిపేట ఏరియా ఆసుపత్రులలో 70 పడకల ఆక్సిజన్ సరఫరా సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం నాటికి ఇలాంటి సౌకర్యాలనే జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ ఆసుపత్రులలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని పలు ఆసుపత్రులు కోవిడ్  చికిత్స విషయంలో భారీ మొత్తాలను వసూలు చేస్తున్నాయన్న విషయం అధికారుల దృష్టికి రావడంతో నిరోధక చర్యలు చేపట్టారు. కోవిడ్  పరీక్షలు, చికిత్సకు సంబంధించి వైద్య ఆరోగ్య విభాగం సంగారెడ్డి జిల్లాలో చార్జీలను నిర్ణయించింది. సాధారణ వార్డులో చేరిన కోవిడ్ బాధితుల నుంచి 400 రూపాయలకు మించి వసూలు చేయకూడదని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి గాయత్రీదేవి తెలిపారు. వెంటిలేటర్ సౌకర్యం కల్పించిన వారి నుంచి రోజుకు 9000 రూపాయలు,  ఐ సి యు లో చేరిన వారినుంచి రోజుకు 4000 రూపాయలకు మించి వసూలు చేయడానికి వీలులేదని స్పష్టం చేశారు.  

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

   12-05-2021


టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

   09-05-2021


Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

   07-05-2021


వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

   29-04-2021


OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

   26-04-2021


వ్యాక్సిన్ కు సిద్ధం కండి..  18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

వ్యాక్సిన్ కు సిద్ధం కండి.. 18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

   23-04-2021


థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   22-04-2021


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle