newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

09-05-202109-05-2021 11:37:22 IST
2021-05-09T06:07:22.500Z09-05-2021 2021-05-09T05:48:38.758Z - - 22-06-2021

టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

చైనా రాకెట్.. గత కొద్దిరోజులుగా తెగ చర్చ జరిగిన సంగతి తెలిసిందే..! చైనా ప్రయోగించిన ఓ రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమి వైపు దూసుకొస్తోందనే వార్త అందరినీ తెగ టెన్షన్ పెట్టింది. ముఖ్యంగా జనావాసాల్లో కూలిపోయే అవకాశముందని చెప్పడంతో చాలా దేశాలు కలవరపడ్డాయి. చైనా సొంతంతా అంతరిక్ష కేంద్రం నిర్మిస్తుండగా.. గత వారం లాంగ్ మార్చ్ 5బీ (Long March 5b) అనే పెద్ద రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కేంద్రం కోర్ మాడ్యూల్‌ను అది విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. అనంతరం నియంత్రణ కోల్పోవడంతో తిరిగి భూమిపై కూలుతుందని అంతరిక్ష నిపుణులు హెచ్చరించారు. భారత్ మీద కూడా పడే అవకాశం కూడా ఉందని చెప్పారు కూడా..! అయితే ఇప్పుడు ఈ ముప్పు తప్పింది. 

 చైనా రాకెట్ శకలాలు చివ‌ర‌కు హిందూ మ‌హా స‌ముద్రంలో ప‌డ్డాయి. భూవాతావ‌ర‌ణంలోకి చేర‌గానే అవి మండిపోయిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. చైనా సొంతంగా నిర్మించుకుంటున్న అంతరిక్ష కేంద్రానికి ఏప్రిల్‌ 29న కోర్ మాడ్యూల్ మోసుకెళ్లిన ‘లాంగ్ మార్చ్5బి’ రాకెట్ అనంత‌రం నియంత్రణ కోల్పోయింది. ఆ రాకెట్ శ‌క‌లాలు ఎక్కడ పడతాయో తెలియక ప్రపంచం మొత్తం ఆందోళన చెందింది. చివ‌ర‌కు భూ వాతావరణంలోకి రాగానే రాకెట్ శ‌క‌లాలు మండిపోయాయి. హిందూ మ‌హా స‌ముద్రంలో ప‌డ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. బీజింగ్ కాల‌మానం ప్ర‌కారం ఆదివారం ఉద‌యం 10:24 గంట‌ల (భార‌త స‌మ‌యం ఉద‌యం 07:54)కు లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ భూవాతావ‌ర‌ణంలోకి తిరిగి ప్ర‌వేశించింది. ఆ త‌ర్వాత 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్త‌ర అక్షాంశాల ద‌గ్గ‌ర కూలిపోయిన‌ట్లు చైనా మ్యాన్డ్ స్పేస్ ఇంజినీరింగ్ ఆఫీస్ వెల్ల‌డించిన‌ట్లు చైనీస్ మీడియా తెలిపింది. ఈ చైనా రాకెట్ వల్ల ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. 18 టన్నుల బరువు ఉన్న ఆ రాకెట్ హిందూ మహా సముద్రంలో కుప్పకూలిపోయింది. గ‌త నెల 29న లాంగ్ మార్చ్ 5బీని చైనాలోని హైన‌న్ దీవి నుంచి నింగికెగిరింది. వెంట‌నే అది నియంత్ర‌ణ కోల్పోవ‌డంతో అది భూమిపై ఎక్క‌డ కూలుతుందో అన్న ఆందోళ‌న క‌లిగింది. 5బీ వేరియెంట్‌లో ఇది రెండో రాకెట్‌. గ‌తేడాది మేలో పంపిన తొలి రాకెట్ ఐవ‌రీ కోస్ట్‌లో కూలింది. అప్పుడు కొన్ని భ‌వ‌నాలు దెబ్బ‌తిన్నాయి. ఇప్పుడు మాత్రం ఎటువంటి హాని కలుగలేదు. 

 

బ్యాటిల్ గ్రౌండ్స్ గేమ్ ని బాన్ చేయమని కేంద్ర మంత్రికి లేఖ

బ్యాటిల్ గ్రౌండ్స్ గేమ్ ని బాన్ చేయమని కేంద్ర మంత్రికి లేఖ

   12 hours ago


వాట్సాప్ మల్టీ-డివైస్ సపోర్ట్ వచ్చేస్తుంది

వాట్సాప్ మల్టీ-డివైస్ సపోర్ట్ వచ్చేస్తుంది

   21-06-2021


బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా 5 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటింది

బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా 5 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటింది

   20-06-2021


గూగుల్ మీట్ హ్యాండ్ రైజింగ్, మాట్లాడటం పూర్తయినప్పుడు చేతిని రైజ్ చేస్తుంది

గూగుల్ మీట్ హ్యాండ్ రైజింగ్, మాట్లాడటం పూర్తయినప్పుడు చేతిని రైజ్ చేస్తుంది

   19-06-2021


మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా తెలుగు తేజం.. సత్య నాదెళ్ళ

మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా తెలుగు తేజం.. సత్య నాదెళ్ళ

   17-06-2021


జీబ్రోనిక్స్ ZEB-FIT4220CH స్మార్ట్ వాచ్ విత్ కాలింగ్ ఫంక్షన్

జీబ్రోనిక్స్ ZEB-FIT4220CH స్మార్ట్ వాచ్ విత్ కాలింగ్ ఫంక్షన్

   17-06-2021


పబ్జి మొబైల్ ఇండియా అవతార్ లాగిన్ అవ్వడానికి ఓటీపీ తప్పనిసరి

పబ్జి మొబైల్ ఇండియా అవతార్ లాగిన్ అవ్వడానికి ఓటీపీ తప్పనిసరి

   16-06-2021


కొత్త చౌకైన స్మార్ట్‌ ఫోన్ కోసం ముఖేష్ అంబానీ యొక్క ప్రణాళికలు

కొత్త చౌకైన స్మార్ట్‌ ఫోన్ కోసం ముఖేష్ అంబానీ యొక్క ప్రణాళికలు

   16-06-2021


కొత్త ఐటి నియమాలు: ట్విట్టర్ భారతదేశానికి తాత్కాలిక చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్‌ను నియమిస్తుంది

కొత్త ఐటి నియమాలు: ట్విట్టర్ భారతదేశానికి తాత్కాలిక చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్‌ను నియమిస్తుంది

   16-06-2021


అద్భుత ఫీచర్లతో.. ఈ-స్కూటర్

అద్భుత ఫీచర్లతో.. ఈ-స్కూటర్

   16-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle