newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

వినియోగదారులకి అందుబాటులో బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

23-09-202123-09-2021 08:50:13 IST
2021-09-23T03:20:13.390Z23-09-2021 2021-09-23T03:20:09.925Z - - 24-01-2022

వినియోగదారులకి అందుబాటులో బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకి మధ్యతరగతి కుటుంబాలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే పెరుగుతున్న పెట్రోలు ధరల నుంచి ఉపశమనం కలిగించేలా హమారా బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఒక్కో నగరంలో అమ్మకాలు ప్రారంభిస్తూ వస్తోన్న బజాజ్‌ సంస్థ.. తాజాగా హైదరాబాద్‌లో వినియోగదారులకి అందుబాటులోకి తీసుకువచ్చింది.

కాగా బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను సొంతం చేసుకోవాలంటే ముందుగా ఆన్‌లైన్‌ రూ.2000 చెల్లించి బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. చేతక్‌ డాట్‌కామ్‌ వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడ అవసరమైన వివరాలు పొందు పరిచి నచ్చిన స్కూటర్‌ని ఎంపిక చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్‌ని రద్దు చేసుకుంటే వెయ్యి రూపాయలు రీఫండ్‌ వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో కూకట్‌పల్లి, బేగంపేట, కాచిగూడలలో ఉన్న బజాజ్‌ చేతక్‌ షోరూమ్‌లలో ఈ స్కూటర్లను అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రర్‌ చేసుకున్న వారు ఈ షోరూమ్‌లకు వెళ్లి స్కూటర్‌ డెలివరీని తీసుకోవాల్సి ఉంటుంది. బజాజ్‌ సంస్థ తన ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాలను తొలుత తమిళనాడుతో మొదలుపెట్టి కర్నాటక, మహారాష్ట్ర మీదుగా ప్రస్తుతం తెలంగాణాలో అమ్మకాలు ప్రారంభించింది. మిగిలిన కంపెనీల తరహాలో కాకుండా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నగరంలో తమ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అందుబాటులోకి తెస్తోంది. 

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఫుల్‌గా ఛార్జ్‌ చేసిన బ్యాటరీతో ఎకానమీ మోడ్‌లో 90 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్‌ చేసేందుకు 5 గంటల సమయం పడుతుంది. క్విక్‌ ఛార్జింగ్‌ ఆప్షన్‌లో గంట సేపు ఛార్జ్‌ చేస్తే 25 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది. దీంతో కనీసం 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. ఇక ధర విషయానికి వస్తే బజాజ్‌ చేతక్‌ ప్రీమియం హైదరాబాద్‌ ఎక్స్‌షోరూం ధర రూ.1,50,461 ఉండగా ఆన్‌రోడ్‌ ధర రూ. 1,89,175లుగా ఉంది. బజాజ్‌ అర్బన్‌ ఎక్స్‌షోరూం ధర రూ. 1,00,000గా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను మాఫీ చేసింది. 1990 బజాజ్ స్కూటర్ దేశ వ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందిందో తెలిసిందే. ఈ బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సైతం అంతే గుర్తింపు పొందుతుందని బజాజ్ సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తూంది.

జి మెయిల్ అద్భుత రికార్డు.. ప్రపంచ జనాభా కంటే ఎక్కువగా..

జి మెయిల్ అద్భుత రికార్డు.. ప్రపంచ జనాభా కంటే ఎక్కువగా..

   11-01-2022


Tecno Spark 8T: టెక్ చానెల్స్ అన్నీ 5/5 రేటింగ్ ఇచ్చిన చీఫ్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే

Tecno Spark 8T: టెక్ చానెల్స్ అన్నీ 5/5 రేటింగ్ ఇచ్చిన చీఫ్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే

   04-01-2022


ఇంటర్నెట్ లేకుండా యూపీఐతో డబ్బులు పంపొచ్చు.. చాలా సులువు

ఇంటర్నెట్ లేకుండా యూపీఐతో డబ్బులు పంపొచ్చు.. చాలా సులువు

   24-12-2021


వెగాస్‌లో జరిగే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో కి పేస్ బుక్, ట్విట్టర్, పింటెరెస్ట్ డ్రాప్

వెగాస్‌లో జరిగే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో కి పేస్ బుక్, ట్విట్టర్, పింటెరెస్ట్ డ్రాప్

   22-12-2021


ట్విట్టర్ కొత్త సిఇఓ భారతీయుడు పరాగ్ అగర్వాల్ వార్షిక వేతనం ఎంతంటే..

ట్విట్టర్ కొత్త సిఇఓ భారతీయుడు పరాగ్ అగర్వాల్ వార్షిక వేతనం ఎంతంటే..

   30-11-2021


INS Vela: భారత నేవీలోకి ఐఎన్ఎస్ వేలా సబ్‌మెరైన్

INS Vela: భారత నేవీలోకి ఐఎన్ఎస్ వేలా సబ్‌మెరైన్

   25-11-2021


Halow Wifi:ఈ కొత్త వైఫై టెక్నాలజీ 1 కిమీ వరకు వస్తుంది

Halow Wifi:ఈ కొత్త వైఫై టెక్నాలజీ 1 కిమీ వరకు వస్తుంది

   20-11-2021


యాపిల్‌ను వెనక్కు నెట్టి మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అధిగమించింది

యాపిల్‌ను వెనక్కు నెట్టి మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అధిగమించింది

   28-10-2021


ఫేస్‌బుక్ టెస్ట్ నకిలీ వార్తలను కేవలం 21 రోజుల్లో ఫిల్టర్

ఫేస్‌బుక్ టెస్ట్ నకిలీ వార్తలను కేవలం 21 రోజుల్లో ఫిల్టర్

   25-10-2021


సెల్ ఫోన్ చార్జర్ తరహాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకురానున్న హీరో మోటోకార్ప్

సెల్ ఫోన్ చార్జర్ తరహాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకురానున్న హీరో మోటోకార్ప్

   21-10-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle