newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బేజోస్‌ రాజీనామా.. ఆయన స్థానంలో ఆండీ జస్సీ

05-07-202105-07-2021 16:52:15 IST
Updated On 05-07-2021 19:06:55 ISTUpdated On 05-07-20212021-07-05T11:22:15.438Z05-07-2021 2021-07-05T11:21:38.819Z - 2021-07-05T13:36:55.869Z - 05-07-2021

అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బేజోస్‌ రాజీనామా.. ఆయన స్థానంలో ఆండీ జస్సీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెజాన్‌ కొత్త సీఈవోగా ఆండీ జాస్సీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అమెజాన్‌ సీఈవో కమ్‌ చైర్మన్‌గా ఉన్న జెఫ్‌ బేజోస్‌ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందారు. ఆయన ఈ సోమవారం తన పదవుల నుంచి తప్పుకున్నారు. దీంతో అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జాస్సీ ఎన్నికయ్యారు. 1994లో అమెరికాలోని ఒక కార్ల షెడ్డులో అమెజాన్‌ ప్రస్థానం మొదలయ్యింది. అటువంటిది జెఫ్‌ బేజోస్‌ ఆధ్వర్యంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్‌ సంస్థగా అమెజాన్ రూపాంతరం చెందింది. కాగా ప్రస్తుతం కొత్త సీఈవోగా ఆండీ జాస్సీ 1997లో అప్పటికే స్టార్టప్‌ స్టేజ్లో ఉన్న అమెజాన్‌లో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా చేరాడు. ఆ తర్వాత జెఫ్‌ బేజోస్‌తో కలిసి పని చేస్తూ కంపెనీనీ ఊహించని ఎత్తులకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌కి హెడ్‌గా ఆండీ జాస్సీ వ్యవహరిస్తున్నారు. 

ఇక కొత్త సీఈవోగా ఆండీ జస్సీకు 61 వేల షేర్లను మంజూరు చేస్తుందని అమెజాన్‌ ప్రకటించింది. దీని విలువ 214 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 1600 కోట్లు) పదేళ్ల కాలానికి ఈ  షేర్లను అతనికి కేటాయించనుంది.  300 మిలియన్ల డాలర్లు విలువైన షేర్లు ఇప్పటికే జాస్పీ సొంతం. అలాగే ఆండీ జస్సీ బేసిక్‌ వేతనం 1,75,000 డాలర్లుగా ( సుమారు కోటి, 30 లక్షల రూపాయలు)  ఉండనుంది. ఇప్పటికే 45.3 మిలియన్లు షేర్లు అతని ఖాతాలోఉన్నాయి. 2020 నాటికి ఆయన పెట్టుబడుల విలువ 41.5 మిలియన్లు డాలర్లు. ప్రపంచం లోనే నంబర్ వన్ ఈ - కామర్స్ సంస్థగా ఎదిగిన అమెజాన్ ఆండీ జస్సీ నేతృత్వంలో మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తుందని కంపెనీ భావిస్తోంది.

JioFiber: కస్టమర్లకు జియో గుడ్ న్యూస్.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!

JioFiber: కస్టమర్లకు జియో గుడ్ న్యూస్.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!

   22-07-2021


వాట్సాప్ 2 మిలియన్ భారతీయ ఖాతాలను నిషేధించింది, నెటిజన్లు మీమ్స్ తో స్పందిస్తున్నారు

వాట్సాప్ 2 మిలియన్ భారతీయ ఖాతాలను నిషేధించింది, నెటిజన్లు మీమ్స్ తో స్పందిస్తున్నారు

   17-07-2021


ఓలాకి ఇంత డిమాండా.. ఊహించలేకపోయిన కంపెనీ.. బ్లాక్ అయిన వెబ్ సైట్

ఓలాకి ఇంత డిమాండా.. ఊహించలేకపోయిన కంపెనీ.. బ్లాక్ అయిన వెబ్ సైట్

   16-07-2021


డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కాపాడటానికి కొత్త ఐటి నియమాలు: కేంద్రం

డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కాపాడటానికి కొత్త ఐటి నియమాలు: కేంద్రం

   13-07-2021


అమెజాన్ వెబ్సైట్ లో అంతరాయం.. తీవ్రంగా ఇబ్బంది పడ్డ కస్టమర్లు

అమెజాన్ వెబ్సైట్ లో అంతరాయం.. తీవ్రంగా ఇబ్బంది పడ్డ కస్టమర్లు

   12-07-2021


అంతరిక్షంలోకి మన తెలుగమ్మాయి..

అంతరిక్షంలోకి మన తెలుగమ్మాయి..

   11-07-2021


ఈ బజాజ్ స్కూటర్, ఇంకా మార్కెట్ లోకి రానేలేదు అయినా..

ఈ బజాజ్ స్కూటర్, ఇంకా మార్కెట్ లోకి రానేలేదు అయినా..

   11-07-2021


రూ. 10 వేలకే రియల్‌ మీ 5 జీ మొబైల్స్

రూ. 10 వేలకే రియల్‌ మీ 5 జీ మొబైల్స్

   07-07-2021


సోషల్ మీడియా డే 2021: చరిత్ర మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి

సోషల్ మీడియా డే 2021: చరిత్ర మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి

   30-06-2021


బిఎమ్‌డబ్ల్యూ M340i ఎక్స్‌డ్రైవ్‌ భారతదేశంలో మరోసారి బుకింగ్ తెరిచింది

బిఎమ్‌డబ్ల్యూ M340i ఎక్స్‌డ్రైవ్‌ భారతదేశంలో మరోసారి బుకింగ్ తెరిచింది

   29-06-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle