newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

అమెజాన్ లో ఉద్యోగాల జాతర.. ప్రపంచ వ్యాప్తంగా 55,000 ఉద్యోగాలు

02-09-202102-09-2021 18:59:35 IST
2021-09-02T13:29:35.408Z02-09-2021 2021-09-02T13:28:57.629Z - - 10-08-2022

అమెజాన్ లో ఉద్యోగాల జాతర.. ప్రపంచ వ్యాప్తంగా 55,000 ఉద్యోగాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సీఈఓ గా జూలైలో అమెజాన్ సీఈఓ పదవీ చేపట్టిన ఆండీ జాస్సీ కంపెనీని మరింత పటిష్టవంతంగా చేయడానికి కార్యోన్ముఖుడయ్యాడు. ఈ సందర్భంగా ఆయన రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 55,000 మందిని నియమించుకోవాలని ప్రణాళిక సిద్దం చేసినట్లు ప్రకటించారు. రిటైల్, క్లౌడ్ డిమాండ్ ను కొనసాగించడం తో పాటు ప్రాజెక్ట్ కైపర్ అని పిలిచే బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను విస్తృతం చేయడానికి, ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి సంస్థకు చాలా మంది అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.  

దీంతో అమెజాన్ వార్షిక జాబ్ ఫెయిర్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానుందని, కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇదొక మంచి అవకాశం అని ఆయన అన్నారు. ఈ 55,000 ఉద్యోగాలలో 40,000 వేలకు పైగా అమెరికాలోనే రిక్రూట్ మెంట్ లు ఉంటాయని మిగతా ఉద్యోగాలు ఇండియా, జపాన్, జర్మనీ దేశాలలో ఫుల్ ఫైల్ చేస్తామని ఆయన తెలిపారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకునేవారు https://www.amazoncareerday.com ద్వారా చేసుకోవచ్చని తెలిపారు. 


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle