newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

చేతులెత్తేసిన బిసిసిఐ.. టి 20 భారత్ లో కష్టం

06-06-202106-06-2021 07:08:54 IST
2021-06-06T01:38:54.136Z06-06-2021 2021-06-06T01:38:47.823Z - - 22-06-2021

చేతులెత్తేసిన బిసిసిఐ.. టి 20 భారత్ లో కష్టం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ ని తాము నిర్వహించలేమని ఐసీసీకి బీసీసీఐ చెప్పేసినట్లు సమాచారం. భారత్‌లో టి20 ప్రపంచకప్‌ నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై తమకు స్పష్టత ఇవ్వాలంటూ జూన్‌ 28 వరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి (బీసీసీఐ) అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఇటీవలే గడువు ఇచ్చింది. అయితే చివరి తేదీకి చాలా ముందే భారత క్రికెట్‌ బోర్డు చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో భారత్‌లో కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం దేశంలో రోజుకు లక్షా 20 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. గత రెండు నెలలతో పోలిస్తే ఇది తక్కువె అయినా మూడో వేవ్‌ గురించి గానీ... అక్టోబర్‌–నవంబర్‌లలో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమని అందుకే టి20 నిర్వహన సాధ్యపడకపోవచ్చన్నది బిసిసిఐ వాదన.

అయితే ఆతిథ్య హక్కులు తమ వద్దే ఉంచుకుంటూ యూఏఈ, ఒమన్‌లలో వరల్డ్‌కప్‌ జరిపితే తమకు అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఎనిమిది టీమ్‌ల ఐపీఎల్‌నే తరలించినప్పుడు 16 జట్ల ప్రపంచకప్‌ ఎలా నిర్వహిస్తాం. ప్రపంచకప్‌ అంటే ఐపీఎల్‌ లాంటిది కాదని... ఏదైనా ఒక అసోసియేట్‌ జట్టులో పొరపాటున కొందరికి కరోనా సోకితే ఇక ఆ జట్టు ఇతర ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం కూడా ఉండదని అందుకే కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న సమయంలో టి 20 ప్రపంచ కప్ నిర్వహించడం తలకు మించిన భారమని బిసిసిఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

India vs New Zealand WTC Final: 5 వ రోజు భారత్ ను రేసులో నిలిపిన షమీ, ఇషాంత్ శర్మ

India vs New Zealand WTC Final: 5 వ రోజు భారత్ ను రేసులో నిలిపిన షమీ, ఇషాంత్ శర్మ

   4 minutes ago

WTC Final Day 5: 5 వ రోజు అట జరిగే అవకాశం ఉంది.. చిన్న చిన్న అంతరాయాలు ఉండొచ్చు

WTC Final Day 5: 5 వ రోజు అట జరిగే అవకాశం ఉంది.. చిన్న చిన్న అంతరాయాలు ఉండొచ్చు

   4 hours ago

WTC Final: వర్షం కారణంగా 4 వ రోజు ఆట కూడా రద్దు

WTC Final: వర్షం కారణంగా 4 వ రోజు ఆట కూడా రద్దు

   11 hours ago

కైల్ జామిసన్ 5 వికెట్లు - డెవాన్ కాన్వే 54 పరుగుల వల్ల న్యూజిలాండ్ సేఫ్ జోన్

కైల్ జామిసన్ 5 వికెట్లు - డెవాన్ కాన్వే 54 పరుగుల వల్ల న్యూజిలాండ్ సేఫ్ జోన్

   21-06-2021

WTC Final: 217 పరుగులకు ఇండియా ఆల్ అవుట్.. జామిసన్ 4 వికెట్లు

WTC Final: 217 పరుగులకు ఇండియా ఆల్ అవుట్.. జామిసన్ 4 వికెట్లు

   20-06-2021

2 వ రోజు అట న్యూజిలాండ్ కి అడ్వాంటేజ్.. కోహ్లీ, రిషబ్ పంత్ ఔట్

2 వ రోజు అట న్యూజిలాండ్ కి అడ్వాంటేజ్.. కోహ్లీ, రిషబ్ పంత్ ఔట్

   20-06-2021

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌ను..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌ను..

   20-06-2021

WTC Final Day 2: రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ వికెట్లు కోల్పోయిన టీమిండియా!

WTC Final Day 2: రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ వికెట్లు కోల్పోయిన టీమిండియా!

   19-06-2021

WTC Final: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, లైవ్ స్కోరు, డే 2

WTC Final: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, లైవ్ స్కోరు, డే 2

   19-06-2021

WTC Final: మొదటి రోజు టెస్ట్ మ్యాచ్ వర్షానికి గోవిందా!

WTC Final: మొదటి రోజు టెస్ట్ మ్యాచ్ వర్షానికి గోవిందా!

   18-06-2021

ఇంకా

Newssting

 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle