newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

వివాదంగా మారిన సైనాపై సిద్దార్థ్ చేసిన ట్వీట్

11-01-202211-01-2022 07:45:54 IST
2022-01-11T02:15:54.141Z11-01-2022 2022-01-11T02:15:51.229Z - - 24-01-2022

వివాదంగా మారిన సైనాపై సిద్దార్థ్ చేసిన ట్వీట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పలు సమస్యలపై సినీ హీరో సిద్దార్థ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటాడు. ఈ మధ్య ఎపి లోని సినిమా టికెట్ల వ్యవహారంలోనూ సిద్ధార్థ్ కామెంట్లు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సిద్దార్థ్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పై సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. ఇటీవల పంజాబ్ లో ప్రధాని మోడీ కాన్వాయ్ అడ్డగింతను సైనా ఖండిచింది. మోదీపై దాడికి ప్రయత్నించడం పిరికిపంద చర్య అని ప్రధాని భద్రత విషయంలో ఇలా జరిగితే ఏ దేశమైనా భద్రంగా ఉన్నట్టు ఎలా భావిస్తామంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై సిద్ధార్థ్ స్పందిస్తూ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. "ఓ చిన్న కాక్ తో ఆడే ఆటలో ప్రపంచ చాంపియన్... దేవుడి దయ వల్ల మనకు దేశాన్ని కాపాడేవాళ్లున్నారు.. అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. 

ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలతోపాటు జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఓ స్త్రీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా స్త్రీద్వేషంతో సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మండిపడింది. సిద్ధార్థ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి విచారణకు చేస్తున్నామని వెల్లడించింది. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేయాలని  జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఆదేశించారు. అంతేకాదు సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ను నిలిపివేయాలని ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాలని ట్విట్టర్ ఇండియా గ్రీవెన్స్ అధికారికి రేఖా లేఖ కూడా రాశారు. అయితే తన వ్యాఖ్యలను సిద్ధార్థ్ సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని సిద్ధార్థ్ మరో ట్వీట్ లో వివరణ ఇచ్చాడు. 'కాక్ అండ్ బుల్' అని కూడా పేర్కొంటుంటామని అయితే దాన్ని మరో విధంగా అన్వయించడం అనైతికం అని తెలిపాడు. ఎవరినీ అవమానపర్చాలని ఈ వ్యాఖ్యలు చేయలేదని సిద్ధార్థ్ స్పష్టం చేశాడు. మరి ఈ ట్వీట్ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి. 

ప్రస్తుత భారత జట్టులో ఒక లోటు ఉంది: సునీల్ గవాస్కర్

ప్రస్తుత భారత జట్టులో ఒక లోటు ఉంది: సునీల్ గవాస్కర్

   21-01-2022


విరాట్ కోహ్లి తన ఇగోను వదులుకుని కొత్త కెప్టెన్ కింద ఆడాలి: కపిల్ దేవ్

విరాట్ కోహ్లి తన ఇగోను వదులుకుని కొత్త కెప్టెన్ కింద ఆడాలి: కపిల్ దేవ్

   18-01-2022


భారత్ మళ్లీ తడబడింది, సిరీస్ ఓడిపోయింది.. టెస్టు కెప్టెన్సీకి కూడా కోహ్లీ గుడ్ బై..

భారత్ మళ్లీ తడబడింది, సిరీస్ ఓడిపోయింది.. టెస్టు కెప్టెన్సీకి కూడా కోహ్లీ గుడ్ బై..

   14-01-2022


ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు..

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు..

   12-01-2022


దక్షిణాఫ్రికా vs భారత్, 3వ టెస్టు: అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంది

దక్షిణాఫ్రికా vs భారత్, 3వ టెస్టు: అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంది

   10-01-2022


సన్‌రైజర్స్ హైదరాబాద్ నన్ను ఎక్కువగా బాధపెట్టింది: డేవిడ్ వార్నర్

సన్‌రైజర్స్ హైదరాబాద్ నన్ను ఎక్కువగా బాధపెట్టింది: డేవిడ్ వార్నర్

   08-01-2022


కేప్ టౌన్ టెస్టు గెలవాలంటే విరాట్ కోహ్లీ ఆడాల్సిన అవసరం ఉంది: రాహుల్ ద్రవిడ్

కేప్ టౌన్ టెస్టు గెలవాలంటే విరాట్ కోహ్లీ ఆడాల్సిన అవసరం ఉంది: రాహుల్ ద్రవిడ్

   07-01-2022


శార్దూల్ ఠాకూర్ వన్ మాన్ షో.. దక్షిణాఫ్రికా 229కి అల్ అవుట్

శార్దూల్ ఠాకూర్ వన్ మాన్ షో.. దక్షిణాఫ్రికా 229కి అల్ అవుట్

   05-01-2022


ధోనికి దొరికిన మద్దతు తనకు దొరుకుంటే మరింతకాలం క్రికెట్ ఆడేవాడిని

ధోనికి దొరికిన మద్దతు తనకు దొరుకుంటే మరింతకాలం క్రికెట్ ఆడేవాడిని

   03-01-2022


IND vs SA 1వ టెస్ట్ డే 4: క్రేజులో విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా.. భారత్ ఆధిక్యం 200

IND vs SA 1వ టెస్ట్ డే 4: క్రేజులో విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా.. భారత్ ఆధిక్యం 200

   29-12-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle