షేన్ వార్న్ హఠాన్మరణానికి కారణాలు ఇవే..
08-03-202208-03-2022 10:10:06 IST
Updated On 08-03-2022 10:35:12 ISTUpdated On 08-03-20222022-03-08T04:40:06.868Z08-03-2022 2022-03-08T04:40:04.029Z - 2022-03-08T05:05:12.641Z - 08-03-2022

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, స్పిన్ మాంత్రికుడు, షేన్ వార్న్(52) హఠాన్మరణంపై థాయ్ పోలీసులు జరిపిన విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. తొందరగా బరువు తగ్గాలనే ఆలోచనలో వార్న్ 14 రోజుల కఠినమైన లిక్విడ్ డైట్ (ద్రవ రూపంలో ఉన్న ఆహారం) ఫాలో అయ్యాడని, ఇదే అతని మరణానికి పరోక్షంగా కారణమైందని అటాప్సి నివేదికలో వెల్లడైనట్లు తెలుస్తోంది. మృతి చెందడానికి ఒక్క రోజు ముందే వార్న్ తన డైట్ షెడ్యూల్‌ను పూర్తి చేశాడని, గతంలో కూడా అతను ఇలాంటి అర్థం పర్థం లేని డైట్లు ఫాలో అయ్యేవాడని వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కిన్ తెలిపాడు. థాయ్‌లాండ్ వెకేషన్‌కు బయల్దేరే ముందు ఛాతీలో నొప్పి వస్తుందని, విపరీతంగా చమటలు పడుతున్నాయని వార్న్ తనతో చెప్పాడని ఎర్స్కిన్ వెల్లడించాడు. ఇటీవలే హార్ట్ చెకప్ కోసం డాక్టర్‌ను కూడా కలిశాడని ఆయన పేర్కొన్నాడు. కాగా వార్న్ గుండెపోటుతోనే మరణించాడని అటాప్సి నివేదికలో వెల్లడైనట్లు థాయ్ పోలీసులు సోమవారం వెల్లడించారు. వార్న్ విల్లా గదిలో ఫ్లోర్‌తో పాటు టవల్స్‌పై రక్తపు మరకల్ని గుర్తించిన మాట వాస్తవమేనని, సీపీఆర్ చేసే క్రమంలో వార్న్ రక్తపు వాంతులు చేసుకున్నాడని వారు పేర్కొన్నారు. వార్న్ మరణానికి ముందు మద్యం తీసుకోలేదని, గత కొంతకాలంగా అతను మద్యం తీసుకున్నట్లు రుజువులు లేవని స్పష్టం చేశారు.

నేను ఏ కార్యక్రమానికి వెళ్ళడం జరదు : రాహుల్ ద్రావిడ్
11-05-2022

ఐపీఎల్ 2022: రికార్డు నమోదు చేసిన సాయి సుదర్శన్
07-05-2022

నేను ఎవరితోనూ వెళ్లడం లేదు .. !
07-05-2022

CAFA U16 ఛాంపియన్షిప్: ఇరాన్ తో తలపడనున్న ఉజ్బెకిస్తాన్
07-05-2022

తొలి విజయాన్ని అందుకున్న హైదరాబాద్ సన్‌రైజర్స్
10-04-2022

గెలుపు ముంగిట బోల్తా పడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్
04-04-2022

తీరు మారని సన్‌రైజర్స్ హైదరాబాద్ 9/3
29-03-2022

పీవీ సింధుకు సీఎం జగన్ అభినందనలు
28-03-2022

వికెట్ పడకుండా ఆడాడు.. విజయం సాధించి పెట్టాడు..
27-03-2022

కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టిన రవిచంద్రన్ అశ్విన్
07-03-2022
ఇంకా