newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

ఆ రెండు కలగానే మిగిలిపోయాయి : సచిన్

01-06-202101-06-2021 10:43:34 IST
2021-06-01T05:13:34.809Z01-06-2021 2021-06-01T05:12:56.656Z - - 22-06-2021

ఆ రెండు కలగానే మిగిలిపోయాయి : సచిన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సచిన్ టెండూల్కర్.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు లేరు. భారత్ లో క్రికెట్ ఒక మతమైతే, సచిన్ టెండూల్కర్ దేవుడుతో సమానం. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తనదైన ఆటతో క్రికెట్‌కే వన్నెతెచ్చాడు. వన్డేల్లో అసాధ్యమైన డబుల్ సెంచరీని సుసాధ్యం చేశాడు. 100 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. క్రికెటంతా తనే ఓ చరిత్రగా మిగిలి 'భారత రత్నం'అయ్యాడు. మైదానంలో తిరుగులేని శక్తిగా.. ప్రపంచ క్రికెట్ ముఖ చిత్రంగా నిలిచిన సచిన్.. అన్ని ఫార్మాట్లు కలిపి 34వేలకు పైగా పరుగులు చేశాడు. మరెన్నో లెక్కలేనన్ని రికార్డులు నెలకొల్పాడు. అయితే ఇంత సుదీర్ఘ కెరీర్ కలిగిన సచిన్ కెరీర్​లో రెండు విషయాల్లో మాత్రం అసంతృప్తి మిగిలిపోయిందట. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు.

'నా జీవితంలో రెండు విషయాలు కలగానే మిగిలిపోయాయి. మొదటిది.. చిన్నతనం నుంచి సునీల్ గవాస్కర్​ నా బ్యాటింగ్​ హీరో. ఆయనతో కలిసి ఆడలేకపోయానని ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. ఆయన రిటైర్​ అయిన రెండేళ్లకు నేను క్రికెట్​లోకి అరంగేట్రం చేశాను. రెండోది.. సర్​ వివియన్​ రిచర్డ్స్​ నా చిన్ననాటి హీరో. ఆయనతో కలిసి కౌంటీ క్రికెట్​లో ఆడటం నా అదృష్టంగా భావిస్తాను. కానీ.. నేను అరంగేట్రం చేసిన తర్వాత ఆయన రిటైర్​ అయినప్పటికీ అంతర్జాతీయ మ్యాచ్​లు మాత్రం ఆయనకు ప్రత్యర్థిగా ఆడలేకపోయాను.'అని సచిన్ చెప్పుకొచ్చాడు.

2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సచిన్.. కెరీర్​లో 463 వన్డేలు ఆడి 18,426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు ఉన్నాయి. 200 టెస్టుల్లో 51 శతకాలతో 15,921 పరుగులు చేశాడు. అలాగే ప్రపంచకప్​లో మొత్తం 2,278 పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

India vs New Zealand WTC Final: 5 వ రోజు భారత్ ను రేసులో నిలిపిన షమీ, ఇషాంత్ శర్మ

India vs New Zealand WTC Final: 5 వ రోజు భారత్ ను రేసులో నిలిపిన షమీ, ఇషాంత్ శర్మ

   an hour ago


WTC Final Day 5: 5 వ రోజు అట జరిగే అవకాశం ఉంది.. చిన్న చిన్న అంతరాయాలు ఉండొచ్చు

WTC Final Day 5: 5 వ రోజు అట జరిగే అవకాశం ఉంది.. చిన్న చిన్న అంతరాయాలు ఉండొచ్చు

   5 hours ago


WTC Final: వర్షం కారణంగా 4 వ రోజు ఆట కూడా రద్దు

WTC Final: వర్షం కారణంగా 4 వ రోజు ఆట కూడా రద్దు

   12 hours ago


కైల్ జామిసన్ 5 వికెట్లు - డెవాన్ కాన్వే 54 పరుగుల వల్ల న్యూజిలాండ్ సేఫ్ జోన్

కైల్ జామిసన్ 5 వికెట్లు - డెవాన్ కాన్వే 54 పరుగుల వల్ల న్యూజిలాండ్ సేఫ్ జోన్

   21-06-2021


WTC Final: 217 పరుగులకు ఇండియా ఆల్ అవుట్.. జామిసన్ 4 వికెట్లు

WTC Final: 217 పరుగులకు ఇండియా ఆల్ అవుట్.. జామిసన్ 4 వికెట్లు

   20-06-2021


2 వ రోజు అట న్యూజిలాండ్ కి అడ్వాంటేజ్.. కోహ్లీ, రిషబ్ పంత్ ఔట్

2 వ రోజు అట న్యూజిలాండ్ కి అడ్వాంటేజ్.. కోహ్లీ, రిషబ్ పంత్ ఔట్

   20-06-2021


ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌ను..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌ను..

   20-06-2021


WTC Final Day 2: రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ వికెట్లు కోల్పోయిన టీమిండియా!

WTC Final Day 2: రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ వికెట్లు కోల్పోయిన టీమిండియా!

   19-06-2021


WTC Final: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, లైవ్ స్కోరు, డే 2

WTC Final: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, లైవ్ స్కోరు, డే 2

   19-06-2021


WTC Final: మొదటి రోజు టెస్ట్ మ్యాచ్ వర్షానికి గోవిందా!

WTC Final: మొదటి రోజు టెస్ట్ మ్యాచ్ వర్షానికి గోవిందా!

   18-06-2021


ఇంకా

Newssting


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle