newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

30-04-202130-04-2021 13:15:17 IST
2021-04-30T07:45:17.087Z30-04-2021 2021-04-30T03:22:26.744Z - - 14-05-2021

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారత్ లో కరోనా పరిస్థితులను చూసి చాలా మంది చలించిపోతూ ఉన్నారు. ఆక్సిజన్ దొరక్క ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారి కోసం ఏదో ఒకటి చేయాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముందుకు వచ్చారు. కోవిడ్‌ రోగులు ఆక్సిజన్‌ కొరత కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత స్థితిలో దానిని నివారించేందుకు 250 మంది సభ్యుల ఒక యువ బృందం మిషన్‌ ఆక్సిజన్‌ పేరుతో నిధుల సేకరణ చేస్తోంది. నా వైపునుంచి వారికి విరాళం ఇచ్చాను అని సచిన్‌ చెప్పుకొచ్చారు. సచిన్ ఈ మిషన్ కోసం కోటి రూపాయలు ఇచ్చారని నేషనల్ మీడియా చెబుతోంది. 

ఇక భారత్ ను ఆదుకోడానికి పలువురు క్రికెటర్లు, ఫ్రాంచైజీలు కూడా ముందుకు వస్తున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన ప్యాట్‌ కమిన్స్‌, వ్యాఖ్యాత బ్రెట్‌లీ తమ వంతుగా విరాళం ప్రకటించారు. కమిన్స్‌  తన వంతు సాయంగా 50 వేల డాలర్లను పీఎం కేర్స్‌ఫండ్‌కు అందజేసిన విషయం తెలిసిందే. ఆసీస్‌ మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ సైతం1 బిట్‌కాయిన్‌ను విరాళంగా అందించనున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ ఆటగాళ్లు, దాని స్పాన్సర్లకు చెందిన జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్‌, జీఎంఆర్‌ వరలక్ష్మీ ఫౌండేషన్‌ సాయానికి సిద్ధమయ్యారు. కరోనాతో కొట్టుమిట్టాడుతున్న ఢిల్లీకి రూ.1.5 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఢిల్లీలో సహాయ కార్యక్రమాలు చేపడుతున్న హేమ్‌కుంట్‌ ఫౌండేషన్‌, ఉదయ్‌ ఫౌండేషన్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, సంరక్షణ కిట్లు సహా ఇతర అత్యవసర వైద్య సామగ్రి కొనుగోలు చేసేందుకు వినియోగించాలని కోరారు.

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇందుకోసం రూ. 7.5 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, టీమ్‌ యాజమాన్యం అందరి భాగస్వామ్యం ఉన్నట్లు రాయల్స్‌ ప్రకటించింది. తాము ఇచ్చిన నిధులు ప్రధానంగా రాజస్తాన్‌ రాష్ట్రంలో ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు శ్రీవత్స్‌ గోస్వామి పెద్ద మనసు చాటుకున్నాడు. దేశంలో ఆక్సిజన్‌ కొరతతో కోవిడ్‌ బాధితులు అల్లాడుతున్న వేళ ప్రాణవాయువు సరఫరాకై రూ. 90 వేలు విరాళమిచ్చాడు. ఈ విషయాన్ని డొనాటేకర్ట్‌ అనే చారిటి ఆర్గనైజేషన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. అత్యవసర సమయంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది.

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు.. పృథ్వీ షా దంచేశాడు..!

ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు.. పృథ్వీ షా దంచేశాడు..!

   30-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle