newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

01-05-202101-05-2021 07:04:45 IST
Updated On 01-05-2021 07:23:18 ISTUpdated On 01-05-20212021-05-01T01:34:45.399Z01-05-2021 2021-05-01T01:34:41.891Z - 2021-05-01T01:53:18.875Z - 01-05-2021

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కింగ్స్ లెవెన్ పంజాబ్ విజయాన్ని అందుకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో బెంగళూరు జట్టు ఓటమి పాలైంది. 180 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు ఏ సమయంలోనూ లక్ష్యం దిశగా వెళ్ళలేదు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ను కెప్టెన్ కెఎల్ రాహుల్ ఆదుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది.  57 బంతుల్లో రాహుల్ 7 ఫోర్లు, 5 సిక్సులతో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. క్రిస్ గేల్ 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సులతో 46 పరుగులు సాధించడం విశేషం.

చివర్లో హర్ ప్రీత్  25 పరుగులు చేసి భారీ స్కోరు సాధనలో తన వంతు పాత్ర పోషించాడు. పంజాబ్ కింగ్స్ ఒకానొక దశలో 200 దాటుతుందని భావించారు. గేల్ అవుట్ కావడంతో స్కోరు మందగించింది. ఓవైపు రాహుల్ తన వికెట్ కాపాడుకుంటూనే స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. చివరి ఓవర్లో రాహుల్, బ్రార్ జోడీ 22 పరుగులు సాధించింది. ఓపెనర్ గా దిగిన ప్రభ్ సిమ్రన్ 7 పరుగులకే అవుట్ కాగా, నికోలాస్ పూరన్ (0)  తీవ్రంగా నిరాశపరిచాడు. పూరన్ డకౌట్ కావడం ఈ ఐపీఎల్ సీజన్ లో నాలుగోసారి. దీపక్ హుడా (5), షారుఖ్ ఖాన్ (0) కూడా విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో కైల్ జేమీసన్ 2, డేనియల్ సామ్స్ 1, చహల్ 1, షాబాజ్ అహ్మద్ 1 వికెట్ తీశారు.

బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముఖ్యంగా హర్‌ప్రీత్ బ్రార్ దెబ్బకు బెంగళూరు బ్యాటింగ్ కుదేలైంది.  కెప్టెన్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డివిలియర్స్ వంటి కీలక ఆటగాళ్లను వెనక్కి పంపి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బెంగళూరు జట్టులో కోహ్లీ (35), రజత్ పటీదార్ (31), హర్షల్ పటేల్ (31), కైల్ జేమీసన్ (16) తప్ప మిగతా వారెవరూ రాణించలేకపోయారు. బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టి బ్యాటింగులో 25 పరుగులు చేసిన హర్‌ప్రీత్ బ్రార్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌కు ఇది మూడో విజయం. 6 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు.. పృథ్వీ షా దంచేశాడు..!

ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు.. పృథ్వీ షా దంచేశాడు..!

   30-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle