newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు.. పృథ్వీ షా దంచేశాడు..!

30-04-202130-04-2021 08:07:21 IST
2021-04-30T02:37:21.255Z30-04-2021 2021-04-30T02:37:16.553Z - - 22-06-2021

ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు.. పృథ్వీ షా దంచేశాడు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పృథ్వీ షా.. చిన్న వయసులోనే అతడి ఆట చూసి ఎంతో మంది క్రికెట్ లెజెండ్స్ అతన్ని గొప్పగా పొగిడారు. తర్వాతి సచిన్ టెండూల్కర్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ పృథ్వీ షాలో నిలకడ అన్నది కనపడలేదు. ఇక ఆస్ట్రేలియా సిరీస్ కు వెళ్ళినప్పుడు ఘోరంగా విఫలమైనప్పుడు అతడి మీద వచ్చిన ట్రోల్స్ అంతాఇంతా కావు. కానీ అవేవీ పట్టించుకోకుండా దేశవాళీలో ఏకంగా డబుల్ సెంచరీ బాదాడు. ఇప్పుడు ఐపీఎల్ లో కూడా తన సత్తా చూపిస్తూ ఉన్నాడు. తాజాగా పృథ్వీ షా ఒకే ఓవర్ లో ఆరు ఫోర్లు కొట్టి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పృథ్వీ షా శివమ్ మావీ వేసిన మొదటి ఓవర్ లో ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాదడం మ్యాచ్ కే హైలైట్. 

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 155 పరుగుల  లక్ష్యాన్ని 16.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. పృథ్వీషా మెరుపులకు తోడు శిఖర్ ధవన్ నిలకడగా ఆడడంతో ఢిల్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 41 బంతులు మాత్రమే ఆడిన షా.. 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్ 46 పరుగులు, పంత్ 16 పరుగులు చేశారు. పృథ్వీషాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఐదింటిలో గెలిచి 10 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. చివర్లో రస్సెల్ మెరుపులు మెరిపించడంతో ఆమాత్రం స్కోరైనా సాధించగలిగింది. 27 బంతులు మాత్రమే ఆడిన రస్సెల్ 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.  శుభ్‌మన్ గిల్ 43, నితీశ్ రాణా 15, త్రిపాఠి19, కార్తీక్ 14, కమిన్స్ 11(నాటౌట్) పరుగులు చేశారు. కెప్టెన్ మోర్గాన్, నరైన్‌లు డకౌట్ అయ్యారు. ఐపీఎల్‌లో కోల్‌కతాకు ఇది ఐదో పరాజయం. నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. 

India vs New Zealand WTC Final: 5 వ రోజు భారత్ ను రేసులో నిలిపిన షమీ, ఇషాంత్ శర్మ

India vs New Zealand WTC Final: 5 వ రోజు భారత్ ను రేసులో నిలిపిన షమీ, ఇషాంత్ శర్మ

   an hour ago


WTC Final Day 5: 5 వ రోజు అట జరిగే అవకాశం ఉంది.. చిన్న చిన్న అంతరాయాలు ఉండొచ్చు

WTC Final Day 5: 5 వ రోజు అట జరిగే అవకాశం ఉంది.. చిన్న చిన్న అంతరాయాలు ఉండొచ్చు

   5 hours ago


WTC Final: వర్షం కారణంగా 4 వ రోజు ఆట కూడా రద్దు

WTC Final: వర్షం కారణంగా 4 వ రోజు ఆట కూడా రద్దు

   12 hours ago


కైల్ జామిసన్ 5 వికెట్లు - డెవాన్ కాన్వే 54 పరుగుల వల్ల న్యూజిలాండ్ సేఫ్ జోన్

కైల్ జామిసన్ 5 వికెట్లు - డెవాన్ కాన్వే 54 పరుగుల వల్ల న్యూజిలాండ్ సేఫ్ జోన్

   21-06-2021


WTC Final: 217 పరుగులకు ఇండియా ఆల్ అవుట్.. జామిసన్ 4 వికెట్లు

WTC Final: 217 పరుగులకు ఇండియా ఆల్ అవుట్.. జామిసన్ 4 వికెట్లు

   20-06-2021


2 వ రోజు అట న్యూజిలాండ్ కి అడ్వాంటేజ్.. కోహ్లీ, రిషబ్ పంత్ ఔట్

2 వ రోజు అట న్యూజిలాండ్ కి అడ్వాంటేజ్.. కోహ్లీ, రిషబ్ పంత్ ఔట్

   20-06-2021


ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌ను..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌ను..

   20-06-2021


WTC Final Day 2: రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ వికెట్లు కోల్పోయిన టీమిండియా!

WTC Final Day 2: రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ వికెట్లు కోల్పోయిన టీమిండియా!

   19-06-2021


WTC Final: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, లైవ్ స్కోరు, డే 2

WTC Final: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, లైవ్ స్కోరు, డే 2

   19-06-2021


WTC Final: మొదటి రోజు టెస్ట్ మ్యాచ్ వర్షానికి గోవిందా!

WTC Final: మొదటి రోజు టెస్ట్ మ్యాచ్ వర్షానికి గోవిందా!

   18-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle