newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

నాలుగున్నర నెలల సుదీర్ఘ పర్యటన

01-06-202101-06-2021 18:01:30 IST
2021-06-01T12:31:30.676Z01-06-2021 2021-06-01T12:31:24.356Z - - 22-06-2021

నాలుగున్నర నెలల సుదీర్ఘ పర్యటన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత మేల్, ఫి మేల్ క్రికెట్ జట్ల ఇంగ్లండ్‌ పర్యటనకు యూకే ప్రభుత్వం సమ్మతి తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా భారత పురుషుల జట్టు ఏకంగా నాలుగున్నర నెలలు యూకేలోనే గడపనుండగా, మహిళా జట్టు కూడా దాదాపు నెలన్నర రోజులు అ‍క్కడే స్టే చేయనుంది. అంతే కాదు మేల్, ఫి మేల్ జట్లు తమ కుటుంబ సభ్యులని కూడా పర్యటనకి అంగీకారం తెలిపింది. తమ దేశంలో సుదీర్ఘ ప‌ర్యట‌న‌ నిమిత్తం రానున్న రెండు జట్ల ప్లేయ‌ర్స్.. తమ త‌మ ఫ్యామిలీస్‌తో క‌లిసి ఉండేందుకు ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డ్‌(ఈసీబీ) ఏర్పాట్లు పూర్తి చేసింది.  

ప్రపంచ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌తో పాటు రూట్‌ సేనతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో పాల్గొనేందుకు భారత పురుషుల జట్టు, ఇంగ్లండ్ వుమెన్స్‌ టీమ్‌తో ఒక టెస్ట్‌, మూడు వ‌న్డేలు, మూడు టీ20లు ఆడేందుకు భారత మహిళా జట్లు జూన్ 2న ప్రత్యేక విమానంలో లండన్‌కు బయల్దేరనున్నాయి. యూకేలో భారత బృందం ల్యాండ్‌ అయ్యాక 10 రోజుల పాటు త‌ప్పనిస‌రిగా క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. అనంతరం ప్లేయర్స్‌తో పాటు వారి కుటుంబ స‌భ్యుల నెగ‌టివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్టును క‌చ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. కాగా, లండన్‌కు బయల్దేరనున్న భారత బృందం ఇప్పటికే ముంబైలోని ఒకే హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంటుంది. భారత్‌లో రెండో దశ కరోనా వ్యాప్తి కారణంగా ఇండియా నుంచి ప్రయాణాల‌పై నిషేధం ఉన్నా.. క్రికెట్ మ్యాచ్‌ల కోసం యూకే ప్రభుత్వం ప్లేయ‌ర్స్‌కు స‌డ‌లింపులు ఇచ్చిన‌ట్లు ఐసీసీ వెల్లడించింది. జూన్ 18 న కోహ్లీ సేన న్యూజిలాండ్ తో టెస్ట్ మ్యాచ్ ఫైనల్ లో ఆడుతుంది. నెల రోజుల తర్వాత ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది. మరో వైపు మహిళలు మిథాలీ నేతృత్వంలో ఇంగ్లాండ్ తో టెస్టు, వందే సిరీసుల్లో తలపడుతుంది. హార్మన్ సారధ్యంలో మూడు టీ20 మ్యాచ్ లు ఆడుతుంది. నాలుగున్నర నెలల సుదీర్ఘ పర్యటన కావడంతో క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులని, సహాయకులని కూడా తీసుకువేల్లెందుకు బిసిసిఐ అనుమతి ఇచ్చింది. వీరి పర్యటనకి బ్రిటన్ అనుమతి లభించింది.

India vs New Zealand WTC Final: 5 వ రోజు భారత్ ను రేసులో నిలిపిన షమీ, ఇషాంత్ శర్మ

India vs New Zealand WTC Final: 5 వ రోజు భారత్ ను రేసులో నిలిపిన షమీ, ఇషాంత్ శర్మ

   36 minutes ago


WTC Final Day 5: 5 వ రోజు అట జరిగే అవకాశం ఉంది.. చిన్న చిన్న అంతరాయాలు ఉండొచ్చు

WTC Final Day 5: 5 వ రోజు అట జరిగే అవకాశం ఉంది.. చిన్న చిన్న అంతరాయాలు ఉండొచ్చు

   5 hours ago


WTC Final: వర్షం కారణంగా 4 వ రోజు ఆట కూడా రద్దు

WTC Final: వర్షం కారణంగా 4 వ రోజు ఆట కూడా రద్దు

   11 hours ago


కైల్ జామిసన్ 5 వికెట్లు - డెవాన్ కాన్వే 54 పరుగుల వల్ల న్యూజిలాండ్ సేఫ్ జోన్

కైల్ జామిసన్ 5 వికెట్లు - డెవాన్ కాన్వే 54 పరుగుల వల్ల న్యూజిలాండ్ సేఫ్ జోన్

   21-06-2021


WTC Final: 217 పరుగులకు ఇండియా ఆల్ అవుట్.. జామిసన్ 4 వికెట్లు

WTC Final: 217 పరుగులకు ఇండియా ఆల్ అవుట్.. జామిసన్ 4 వికెట్లు

   20-06-2021


2 వ రోజు అట న్యూజిలాండ్ కి అడ్వాంటేజ్.. కోహ్లీ, రిషబ్ పంత్ ఔట్

2 వ రోజు అట న్యూజిలాండ్ కి అడ్వాంటేజ్.. కోహ్లీ, రిషబ్ పంత్ ఔట్

   20-06-2021


ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌ను..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌ను..

   20-06-2021


WTC Final Day 2: రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ వికెట్లు కోల్పోయిన టీమిండియా!

WTC Final Day 2: రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ వికెట్లు కోల్పోయిన టీమిండియా!

   19-06-2021


WTC Final: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, లైవ్ స్కోరు, డే 2

WTC Final: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, లైవ్ స్కోరు, డే 2

   19-06-2021


WTC Final: మొదటి రోజు టెస్ట్ మ్యాచ్ వర్షానికి గోవిందా!

WTC Final: మొదటి రోజు టెస్ట్ మ్యాచ్ వర్షానికి గోవిందా!

   18-06-2021


ఇంకా

Newssting


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle