newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

04-05-202104-05-2021 09:36:08 IST
Updated On 04-05-2021 12:42:16 ISTUpdated On 04-05-20212021-05-04T04:06:08.396Z04-05-2021 2021-05-04T03:26:39.140Z - 2021-05-04T07:12:16.223Z - 04-05-2021

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ లో కరోనా కలకలం మొదలైన తర్వాత టోర్నమెంట్ సజావుగా సాగుతుందా లేదా అనే అనుమానాలు వెంటాడుతూ ఉన్నాయి. ఇద్దరు క్రికెటర్లకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో నిన్నటి మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉండగా.. కరోనా పరీక్షలు నిర్వహించారు. కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌కు వైరస్‌ సోకినట్లు తేలింది. జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

అయితే మిగిలిన ఆటగాళ్లందరికీ కరోనా నెగటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సోమవారం నాటి మ్యాచ్‌ను వాయిదా వేసినట్లు బీసీసీఐ తెలిపింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బృందంలో కూడా కరోనా కలకలం మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్ సిఈఓ కాశీ విశ్వనాథ్, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బస్సు క్లీనర్ కు కూడా కరోనా సోకింది. దీంతో వీరిని క్వారెంటైన్ లోకి పంపారు. 10 రోజుల పాటూ జట్టుతో వీరు కలవరని తెలిపారు. రెండు సార్లు నెగటివ్ టెస్టులు వచ్చిన తర్వాతనే జట్టులోకి తీసుకోనున్నారు. 

దీంతో నేడు జరిగే మ్యాచ్ పై కూడా ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ ను నిర్వహించనున్నారు. టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లు గెలిచి నాలుగో స్థానంలో ఉండగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 7 మ్యాచ్ లలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయాన్ని అందుకుని ఆఖరి స్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరాలి అంటే అద్భుతమే జరగాలి.

ఇక జట్టులో ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో.. అనే ప్రశ్నలు కూడా హైదరాబాద్ జట్టును వేధిస్తూ ఉన్నాయి. బెయిర్ స్టో ఒక్కడు కాస్త టచ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నా.. మిగిలిన ఏ ఒక్క ఆటగాడిలో కూడా నిలకడ అన్నది కనిపించకుండా పోయింది. ముఖ్యంగా మిడిలార్డర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దారుణమైన ప్రదర్శన కనబరుస్తూ ఉన్నారు. ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై పిచ్ లో సరిగా రాణించలేక పోయినప్పటికీ.. ఢిల్లీలో మాత్రం అద్భుతంగా ఆడుతూ ఉన్నారు.

ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ముంబై విజయాన్ని అందుకుంది. ఇక బౌలింగ్ యూనిట్ కాస్త మెరుగుపడాల్సి ఉంది. చెన్నైతో మ్యాచ్ లో ముంబై బౌలింగ్ యూనిట్ తేలిపోయిన సంగతి తెలిసిందే..! బౌలింగ్ యూనిట్ కూడా రాణిస్తే మరో విజయాన్ని ముంబై సొంతం చేసుకోవచ్చు. ఇక కరోనా భయాల కారణంగా ముంబై-హైదరాబాద్ మ్యాచ్ జరిగే వరకూ అనుమానాలు వెంటాడుతూ ఉన్నాయి. 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు.. పృథ్వీ షా దంచేశాడు..!

ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు.. పృథ్వీ షా దంచేశాడు..!

   30-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle