newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

ఒక్క టెస్ట్ మ్యాచ్‌ రద్దు తో 304 కోట్ల భారీ నష్టం..

10-09-202110-09-2021 21:35:19 IST
2021-09-10T16:05:19.737Z10-09-2021 2021-09-10T16:05:09.430Z - - 22-09-2021

ఒక్క టెస్ట్ మ్యాచ్‌ రద్దు తో 304 కోట్ల భారీ నష్టం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీం ఇండియా క్రికెట్ జట్టులోని అయిదు గురు కరోనా బారిన పడటంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆఖరి టెస్ట్ రద్దు చేయడంతో లాంకషైర్‌ క్రికెట్‌కు, ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ)కు భారీ నష్టం వాటిల్లిందని సమాచారం.   ప్రసార హక్కులు ఇతరత్రా మార్గాల ద్వారా 30 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 304 కోట్లు) వరకు నష్టం వాటిల్లిందంటూ ఈసీబీ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రద్దయిన మ్యాచ్ ని రీ షెడ్యూల్ చేసినప్పటికీ ఆ మ్యాచ్‌తో ప్రస్తుత సిరీస్‌కు సంబంధం ఉండదని, అది స్టాండ్‌ అలోన్‌ మ్యాచ్‌ అవుతుందని (సెపరేట్‌ మ్యాచ్‌) ఈసీబీ క్లారిటీ ప్రకటించింది.

కాగా భారత కోచ్‌ రవిశాస్త్రి కి ముందుగా కరోనా పాజిటివ్ అని తెలిసింది. అలాగే మిగతా ఆటగాళ్లకి కూడా కరోనా టెస్టులు నిర్వహించడంతో నలుగురు ఆటగాళ్లకి సైతం కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఇండియా రెండు మ్యాచులు గెలవడంతో టీమిండియా(2-1) అనధికారికంగా కైవసం చేసుకున్నట్టేనని విశ్లేషకులు అంటున్నారు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ కి పెద్ద దెబ్బ.. నటరాజన్ అవుట్

సన్‌రైజర్స్ హైదరాబాద్ కి పెద్ద దెబ్బ.. నటరాజన్ అవుట్

   3 hours ago


6 బంతుల్లో 3 పరుగులు చేయలేక మ్యాచ్ ఓడిపోయిన పంజాబ్ కింగ్స్‌

6 బంతుల్లో 3 పరుగులు చేయలేక మ్యాచ్ ఓడిపోయిన పంజాబ్ కింగ్స్‌

   8 hours ago


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవడానికి కారణం అదే!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవడానికి కారణం అదే!

   21-09-2021


CSK vs MI: రుతురాజ్ గైక్వాడ్ వీరవిహారం.. 19 ఓవర్లలో ఏకంగా 24 పరుగులు

CSK vs MI: రుతురాజ్ గైక్వాడ్ వీరవిహారం.. 19 ఓవర్లలో ఏకంగా 24 పరుగులు

   19-09-2021


న్యూజిలాండ్ పాకిస్తాన్ క్రికెట్‌ను చంపేసింది: షోయబ్ అక్తర్

న్యూజిలాండ్ పాకిస్తాన్ క్రికెట్‌ను చంపేసింది: షోయబ్ అక్తర్

   17-09-2021


ఫ్యూచర్ భారత జట్టు కెప్టెన్‌గా ఆ ఆటగాడే సరైన నిర్ణయం: సునీల్ గవాస్కర్

ఫ్యూచర్ భారత జట్టు కెప్టెన్‌గా ఆ ఆటగాడే సరైన నిర్ణయం: సునీల్ గవాస్కర్

   17-09-2021


ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత భారత కెప్టెన్‌గా తప్పుకుంటాను: విరాట్ కోహ్లీ

ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత భారత కెప్టెన్‌గా తప్పుకుంటాను: విరాట్ కోహ్లీ

   16-09-2021


అన్ని ఫార్మాట్లలో కోహ్లీనే కెప్టెన్ గా కొనసాగుతాడు.. బీసీసీఐ

అన్ని ఫార్మాట్లలో కోహ్లీనే కెప్టెన్ గా కొనసాగుతాడు.. బీసీసీఐ

   14-09-2021


IPL 2021: ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ దుబాయ్ లో ల్యాండ్

IPL 2021: ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ దుబాయ్ లో ల్యాండ్

   12-09-2021


Breaking: ఇండియా టీమ్ లో కేసులు పెరగడంతో 5 వ టెస్ట్ రద్దు

Breaking: ఇండియా టీమ్ లో కేసులు పెరగడంతో 5 వ టెస్ట్ రద్దు

   10-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle