newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

ఎంఎస్ ధోని ని మెంటర్ గా నియమించడంపై వివాదం..

09-09-202109-09-2021 19:54:53 IST
2021-09-09T14:24:53.122Z09-09-2021 2021-09-09T14:24:21.991Z - - 22-09-2021

ఎంఎస్ ధోని ని మెంటర్ గా నియమించడంపై వివాదం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీ20 ప్రపంచక‌ప్‌లో టీమిండియాకు మెంటర్‌గా ఎమ్మెస్ ధోనిని నియ‌మించ‌డంపై వివాదం రాజుకుంది. ధోనీని మెంటర్ గా ఎలా నియమిస్తారని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు అందింది. లోధా క‌మిటీ సిఫార్సుల  ప్రకారం ధోని నియామకం ప‌రస్ప‌ర విరుద్ధ ప్ర‌యోజ‌నాల క్లాజ్‌ ఉల్లంఘన 38(4) కిందికి వస్తుందని మ‌ధ్య‌ప్ర‌దేశ్ క్రికెట్ అసోసియేష‌న్ మాజీ స‌భ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆయన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా సహా అపెక్స్ కౌన్సిల్‌ సభ్యులకు లేఖ రాశాడు. లోధా క‌మిటీ సిఫార్సుల మేరకు ఓ వ్య‌క్తి రెండు ప‌ద‌వులు ఎలా నిర్వహిస్తాడన్న విషయంపై సంజీవ్ గుప్తా స్పష్టత కోరారు. అయితే, దీనిపై అపెక్స్ కౌన్సిల్ త‌మ లీగ‌ల్ టీమ్‌ను సంప్ర‌దించాల్సి ఉందని బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇదిలా ఉంటే, ధోని ఇప్ప‌టికే బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా అతను టీమిండియాకు మెంటర్‌గా కూడా ఎంపిక కావడంతో వివాదం మొదలైంది. దీనిపై బిసిసిఐ స్పందించాల్సి వుంది.

అక్టోబర్‌ 17న యూఏఈ వేదికగా ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ 2021 లో తలపడే భారత జట్టుకు జార్ఖండ్‌ డెనమైట్‌ ఎంఎస్ ధోనీ ని మెంటార్ గా బిసిసిఐ నియమించింది. అలాగే 15 మంది సభ్యుల భారత జట్టును కూడా  బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు విరాట్ కోహ్లీ సారధ్యం వహించనుండగా, వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ వ్యవహరించనున్నాడు. 15 మందితో కూడిన జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.  భారత టీ20 ప్రపంచకప్‌ జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంత్రకన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ. అయితే ఈ జట్టులో శిఖర్ ధావన్ కి చోటు లభించలేదు. కాగా ఈ ప్రపంచకప్ ని సైతం భారత్ సొంతం చేసుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ కి పెద్ద దెబ్బ.. నటరాజన్ అవుట్

సన్‌రైజర్స్ హైదరాబాద్ కి పెద్ద దెబ్బ.. నటరాజన్ అవుట్

   4 hours ago


6 బంతుల్లో 3 పరుగులు చేయలేక మ్యాచ్ ఓడిపోయిన పంజాబ్ కింగ్స్‌

6 బంతుల్లో 3 పరుగులు చేయలేక మ్యాచ్ ఓడిపోయిన పంజాబ్ కింగ్స్‌

   10 hours ago


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవడానికి కారణం అదే!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవడానికి కారణం అదే!

   21-09-2021


CSK vs MI: రుతురాజ్ గైక్వాడ్ వీరవిహారం.. 19 ఓవర్లలో ఏకంగా 24 పరుగులు

CSK vs MI: రుతురాజ్ గైక్వాడ్ వీరవిహారం.. 19 ఓవర్లలో ఏకంగా 24 పరుగులు

   19-09-2021


న్యూజిలాండ్ పాకిస్తాన్ క్రికెట్‌ను చంపేసింది: షోయబ్ అక్తర్

న్యూజిలాండ్ పాకిస్తాన్ క్రికెట్‌ను చంపేసింది: షోయబ్ అక్తర్

   17-09-2021


ఫ్యూచర్ భారత జట్టు కెప్టెన్‌గా ఆ ఆటగాడే సరైన నిర్ణయం: సునీల్ గవాస్కర్

ఫ్యూచర్ భారత జట్టు కెప్టెన్‌గా ఆ ఆటగాడే సరైన నిర్ణయం: సునీల్ గవాస్కర్

   17-09-2021


ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత భారత కెప్టెన్‌గా తప్పుకుంటాను: విరాట్ కోహ్లీ

ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత భారత కెప్టెన్‌గా తప్పుకుంటాను: విరాట్ కోహ్లీ

   16-09-2021


అన్ని ఫార్మాట్లలో కోహ్లీనే కెప్టెన్ గా కొనసాగుతాడు.. బీసీసీఐ

అన్ని ఫార్మాట్లలో కోహ్లీనే కెప్టెన్ గా కొనసాగుతాడు.. బీసీసీఐ

   14-09-2021


IPL 2021: ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ దుబాయ్ లో ల్యాండ్

IPL 2021: ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ దుబాయ్ లో ల్యాండ్

   12-09-2021


ఒక్క టెస్ట్ మ్యాచ్‌ రద్దు తో 304 కోట్ల భారీ నష్టం..

ఒక్క టెస్ట్ మ్యాచ్‌ రద్దు తో 304 కోట్ల భారీ నష్టం..

   10-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle