newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

07-05-202107-05-2021 14:39:04 IST
Updated On 08-05-2021 07:32:16 ISTUpdated On 08-05-20212021-05-07T09:09:04.831Z07-05-2021 2021-05-07T09:08:57.924Z - 2021-05-08T02:02:16.995Z - 08-05-2021

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌రోనా కష్ట సమయాల్లో సాయం అందించేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య‌, హీరోయిన్ అనుష్క శర్మ ముందుకు వ‌చ్చారు. త‌మ వంతుగా రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. దేశంలో అనేక మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారని, వారికి సాయ‌ప‌డాల‌ని వీడియోను అప్లోడ్ చేశారు. ప్రతి ఒక్కరూ సాయం చేయడానికి ముందుకు రావాలని.. మీరు చేసే చిన్న సాయం కూడా ఎంతో మందికి ఉపయోగపడుతుందని అన్నారు. ఆరోగ్య వ్యవస్థలు సవాలును ఎదుర్కొంటున్న వేళ అంద‌రూ కలిసికట్టుగా ముందుకు రావాల‌ని వారు పిలుపునిచ్చారు. 

కెట్టో స్వ‌చ్ఛంద‌ సంస్థ‌ ద్వారా ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామ‌ని, ఎంతో కొంత సాయం చేయాల‌ని కోరారు. తమ  ఉద్యమంలో అందరూ చేరాల‌ని కోరారు. కెట్టోకు విరాళాలు పంపాల‌ని, దాని ద్వారా క‌రోనా రోగుల‌కు సాయం చేయొచ్చ‌ని విజ్ఞ‌ప్తి చేశారు. దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తుండటంతో అనేక మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారికి సహాయపడటం కోసం ప్రారంభించిన ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని తమ ఫ్యాన్స్‌ను కోరారు.  సహాయ కార్యక్రమాల కోసం నిధిని సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నిధి కోసం తాము రూ.2 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. మనం కలిసికట్టుగా ముందుకు వచ్చి, మన భారత దేశానికి సహాయపడవలసిన అవసరం ఉంది అని విరాట్-అనుష్క చెప్పారు. 

ఐపీఎల్ వాయిదా ప‌డ‌టంతో వెంట‌నే కొవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాలు పంచుకుంటూ ఉన్నాడు కోహ్లీ. అహ్మ‌దాబాద్ నుంచి ముంబై వెళ్లిపోయిన కోహ్లి కోవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని యువ‌సేన స‌భ్యుడు రాహుల్ క‌నాల్ ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. కోహ్లీ త‌మ‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాడ‌ని చెబుతూ ఫొటోల‌ను షేర్ చేశాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఏడాది ఐపీఎల్ లో మంచి ప్రదర్శన కనబరుస్తూ ఉండగా.. బయో బబుల్ లోకి కరోనా ఎంటర్ అవ్వడంతో సీజన్ ను వాయిదా వేశారు.   

India vs New Zealand WTC Final: 5 వ రోజు భారత్ ను రేసులో నిలిపిన షమీ, ఇషాంత్ శర్మ

India vs New Zealand WTC Final: 5 వ రోజు భారత్ ను రేసులో నిలిపిన షమీ, ఇషాంత్ శర్మ

   an hour ago

WTC Final Day 5: 5 వ రోజు అట జరిగే అవకాశం ఉంది.. చిన్న చిన్న అంతరాయాలు ఉండొచ్చు

WTC Final Day 5: 5 వ రోజు అట జరిగే అవకాశం ఉంది.. చిన్న చిన్న అంతరాయాలు ఉండొచ్చు

   5 hours ago

WTC Final: వర్షం కారణంగా 4 వ రోజు ఆట కూడా రద్దు

WTC Final: వర్షం కారణంగా 4 వ రోజు ఆట కూడా రద్దు

   12 hours ago

కైల్ జామిసన్ 5 వికెట్లు - డెవాన్ కాన్వే 54 పరుగుల వల్ల న్యూజిలాండ్ సేఫ్ జోన్

కైల్ జామిసన్ 5 వికెట్లు - డెవాన్ కాన్వే 54 పరుగుల వల్ల న్యూజిలాండ్ సేఫ్ జోన్

   21-06-2021

WTC Final: 217 పరుగులకు ఇండియా ఆల్ అవుట్.. జామిసన్ 4 వికెట్లు

WTC Final: 217 పరుగులకు ఇండియా ఆల్ అవుట్.. జామిసన్ 4 వికెట్లు

   20-06-2021

2 వ రోజు అట న్యూజిలాండ్ కి అడ్వాంటేజ్.. కోహ్లీ, రిషబ్ పంత్ ఔట్

2 వ రోజు అట న్యూజిలాండ్ కి అడ్వాంటేజ్.. కోహ్లీ, రిషబ్ పంత్ ఔట్

   20-06-2021

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌ను..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌ను..

   20-06-2021

WTC Final Day 2: రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ వికెట్లు కోల్పోయిన టీమిండియా!

WTC Final Day 2: రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ వికెట్లు కోల్పోయిన టీమిండియా!

   19-06-2021

WTC Final: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, లైవ్ స్కోరు, డే 2

WTC Final: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, లైవ్ స్కోరు, డే 2

   19-06-2021

WTC Final: మొదటి రోజు టెస్ట్ మ్యాచ్ వర్షానికి గోవిందా!

WTC Final: మొదటి రోజు టెస్ట్ మ్యాచ్ వర్షానికి గోవిందా!

   18-06-2021

ఇంకా

Naresh

 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle