newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

20-09-202120-09-2021 19:22:37 IST
Updated On 20-09-2021 19:35:03 ISTUpdated On 20-09-20212021-09-20T13:52:37.644Z20-09-2021 2021-09-20T13:40:47.188Z - 2021-09-20T14:05:03.724Z - 20-09-2021

చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అక్టోబర్ 20వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ పాదయాత్ర కు ప్రజాప్రస్థానం అని పేరు పెట్టినట్లు కూడా తెలిపారు. గతంలో వైఎస్ చేసిన పాదయాత్రకు కూడా ప్రజాప్రస్థానం అని పేరు పెట్టడం, ఆ పాదయాత్రని కూడా చేవెళ్ళ నుండే ప్రారంభించడం తెలిసిందే. ఇప్పుడు షర్మిల సైతం తన తండ్రి కి కలిసివచ్చిన ఈ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారు. దాదాపు 90 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర సాగుతుందని షర్మిల తెలిపారు. అల్లాగే సిఎం కేసీఆర్ పాలన తీరుపై విమర్శలు గుప్పించారు. ఏడేళ్ల కేసీఆర్ ఆయన కుటుంబ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసి సంక్షేమ పాలన అందిస్తామన్న నమ్మకాన్ని పాదయాత్ర ద్వారా ప్రజలకు కల్పిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. బీజేపీ కాంగ్రెస్లకు కేసీఆర్ అమ్ముడుపోయారని.. ఆయనపై ప్రజలకు విరక్తి వచ్చిందన్నారు.  ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి తాము పోరాడతామని షర్మిల అన్నారు. 

అయితే ఈ ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగిస్తున్నప్పటికీ ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం తాను చేస్తున్న దీక్షలు మాత్రం కొనసాగిస్తూనే ఉంటానని ఆమె తెలిపారు. ఇక  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని బలోపేతం చేసేందుకు వైఎస్ షర్మిల ప్రశాంత్ కిషోర్ సేవలను కూడా తీసుకోవాలని నిర్ణయించారు. త్వరలో ఐ ప్యాక్ టీం షర్మిల కోసం పని చేస్తుందని చెబుతున్నారు. మరోవైపు కొంత మంది నేతలు పార్టీని వీడి వెళ్ళినప్పటికీ ఈ పాదయాత్ర ద్వారా అన్ని నియోజక వర్గాలలో పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు టిపిసిసి అధ్యక్షుడు సైతం పాదయాత్ర చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పై అటు కాంగ్రెస్, ఇటు బిజెపి లు ఓ స్థాయిలో విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా వైఎస్ షర్మిల సైతం ప్రభుత్వ వ్యతిరేకతని ఎండగట్టడానికి సిద్దపడుతున్నారు. మరి పాదయాత్ర ద్వారా వైఎస్ షర్మిల తన పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందన్నది వేచిచూడాల్సిందే. 

వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల ఎజెండాపై సోనియా గాంధీకి నవజ్యోత్ సిద్ధూ లేఖ

వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల ఎజెండాపై సోనియా గాంధీకి నవజ్యోత్ సిద్ధూ లేఖ

   4 minutes ago


సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటల జమున

సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటల జమున

   an hour ago


టిఆర్ఎస్ పార్టీ లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు

టిఆర్ఎస్ పార్టీ లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు

   5 hours ago


రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు..?

రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు..?

   5 hours ago


పూర్తికాల అధ్యక్షురాలిగా నేనే ఉంటా: సోనియా గాంధీ

పూర్తికాల అధ్యక్షురాలిగా నేనే ఉంటా: సోనియా గాంధీ

   16-10-2021


కొత్త చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ సమావేశం

కొత్త చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ సమావేశం

   16-10-2021


మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఛత్తీస్‌గఢ్‌లో అనారోగ్యంతో మరణించారు

మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఛత్తీస్‌గఢ్‌లో అనారోగ్యంతో మరణించారు

   15-10-2021


టిఆర్ఎస్ పై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్

టిఆర్ఎస్ పై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్

   14-10-2021


ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 400 సీట్లను గెలుచుకోగలదు: అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 400 సీట్లను గెలుచుకోగలదు: అఖిలేష్ యాదవ్

   15-10-2021


మహిళల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్

మహిళల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్

   14-10-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle