newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈటెల‌పై హ‌రీశ్ రావు, కేటీఆర్ మాటేంటి

05-05-202105-05-2021 09:55:04 IST
2021-05-05T04:25:04.611Z05-05-2021 2021-05-05T04:24:52.487Z - - 14-05-2021

ఈటెల‌పై హ‌రీశ్ రావు, కేటీఆర్ మాటేంటి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఈటెల రాజేంద‌ర్ ని మించిన రాజ‌కీయం ఇప్పుడు తెలంగాణ‌లో లేదు. ఎందుకంటే.. 20  ఏళ్ల ప్ర‌యాణం.. రెండో మూడు కామెంట్లు. అవి కూడా అంత సీరియ‌స్ ఏమీ కావు. అంత‌కు మించిన డ్రామా న‌డిపి.. సీఎం కేసీఆర్ సాగ‌నంపారు. హాలీవుడ్ సినిమాకి మించిన స్పీడ్ తో న‌డిచింది ఎవ్వారం. ఆ ఎవ్వారంపై హైకోర్టు ఏం చెప్పిందో చూశాం క‌దా. ఇదేం స‌ర్వే అనేసింది హైకోర్టు. అలాంటి నిబ్బ‌ద్ద‌త లేని స‌ర్వేలు జ‌రిపి.. ఈటెల‌ను త‌ప్పుడ‌స్తుడ్ని చేశారు. బ‌ట్ట కాల్చి మీదేయ‌డం అంటారు క‌దా. అలాంటిదే జ‌రిగింది.

ఇదంతా వ‌దిలేస్తే.. సీఎం కేసీఆర్ త‌ర్వాత ఆ స్థాయి లీడ‌ర్ ఈటెల‌. ఆ  త‌ర్వాత అంత ప‌వ‌ర్ ఉన్న లీడ‌ర్స్.. మినిస్ట‌ర్ కేటీఆర్, మినిస్ట‌ర్ హ‌రీశ్ రావులు. సీఎం కేసీఆర్ ఫ్యామిలీ కావ‌డంతో.. వారికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి తెలిసిందే. బ‌య‌టి లీడ‌ర్ అయినా.. ఈటెల క్రేజ్ వేరే. ఆయ‌న పెద్ద‌రికం వేరే. ఈటెల‌తో అంద‌రిలాగే మినిస్ట‌ర్  కేటీఆర్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కేటీఆర్ సీఎం అవ్వాలి. ఆయ‌న సీఎం అయితే నేను స్వాగ‌తిస్తా.. ఆయ‌న‌కి అన్ని అర్హ‌త‌లు ఉన్న‌య్ అని ముందుగా గొంతెత్తి చెప్పిన లీడ‌ర్ ఈటెల రాజేంద‌ర్. మ‌రి అలాంటి ఈటెల రాజేంద‌ర్ కి అంత అన్యాయం జ‌రిగితే.. కేటీఆర్ ఏమీ మాట్లాడ‌రేంటి.  మొన్నీ మ‌ధ్య‌నే ఈటెల‌ను సీఎం కేసీఆర్ సైడ్ చేస్తే.. కేటీఆర్ ద‌గ్గ‌రుండి మ‌రీ.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ కి తీసుకెళ్లి మాట్లాడారు అని తెలిసిందే క‌దా. ఇప్పుడు మాత్రం కేటీఆర్ ఏమీ మాట్లాడడం లేదు. పోనీ ఆయ‌న‌కి క‌రోనా క‌దా ఏం మాట్లాడుతారులే అనుకుందాం. ట్వీట్ చేయొచ్చు క‌దా అనే వాళ్లు ఉన్నారు. ఫోన్లు గ‌ట్రా చేసి.. అంతా కూల్ చేయొచ్చు క‌దా అనే వాళ్లూ ఉన్నారు. ఇదంతా  వ‌దిలేస్తే.. బ‌య‌టికి వ‌చ్చాక ఏం మాట్లాడ‌తారు అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ టాపిక్ అయింది.

ఇక ఈ విష‌యంలో మినిస్ట‌ర్ హ‌రీశ్ రావు కూడా సైలెంట్ అయిపోయారు. పార్టీ మొద‌ట్నుంచీ.. ఈటెల‌తో మంచి అనుబంధం ఉన్న లీడ‌ర్ హ‌రీశ్ రావు. తెలంగాణ ఉద్య‌మం క‌లిసి చేశారు. క‌లిసి పోరాడారు. అలాంటి ఈటెల‌కి ఈ పరిస్థితి వ‌స్తే.. హరీశ్ రావు రెస్పాండ్ అవ‌క‌పోవ‌డం ఏంటి అంటున్నారు. అలాగే ఇంకో మాట కూడా ఉంది. హ‌రీశ్ రావుది కూడా ఈటెల లాంటి ప‌రిస్థితే. హ‌రీశ్ ని ఎప్పుడు బ‌య‌టికి తోల‌తారో కూడా తెలీదు. పైగా హ‌రీశ్ రావు, ఈటెల క‌లిసి పార్టీ పెడుతున్నారు అని.. సీఎం కేసీఆర్ సీరియ‌స్ గా ఉన్నారు అనే టాక్ ఉంది. ఇలాంటి టైంలో.. హ‌రీశ్ మాత్రం ఏం మాట్లాడ‌గ‌ల‌రు అనే వాళ్లూ ఉన్నారు. మ‌రి ఈటెల పార్టీ పెడితే.. హ‌రీశ్ వెళ్తారా.. నా ఫ్యామిలీ పార్టీ అని ఉంటారా చూడాలి.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   an hour ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   4 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   9 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   9 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   8 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   10 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   6 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   11 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle