newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

ధనిక రాష్ట్రంలో పేదలు ఎందుకు పెరుగుతున్నారు? విజయశాంతి సూటి ప్రశ్న

09-10-202109-10-2021 22:05:28 IST
2021-10-09T16:35:28.631Z09-10-2021 2021-10-09T16:35:22.443Z - - 17-10-2021

ధనిక రాష్ట్రంలో పేదలు ఎందుకు పెరుగుతున్నారు? విజయశాంతి సూటి ప్రశ్న
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీజేపీ నాయకురాలు , ప్రముఖ నటి విజయశాంతి సీఎం కేసీఆర్ పై. విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ.. ఒక వైపు మనది ధనిక రాష్ట్రమని రాష్ట్ర సర్కార్ గొప్పలు చెప్పుతున్నప్పడు.. మరో దిక్కు రాష్ట్రంలో పేదల సంఖ్య నానాటికీ ఎలా పెరిగిపోతున్నదో కేసీఆర్ సర్కార్ చెప్పాలని  జీఎస్‌‌డీపీలో దేశంలో రాష్ట్రం 5వ స్థానంలో ఉందని, సర్​ప్లస్‌‌ స్టేట్‌‌ అని ఆర్థిక శాఖ చెప్పే లెక్కలకు, సివిల్‌‌ సప్లయ్స్‌‌ శాఖ జారీ చేసే రేషన్‌‌ కార్డులకు పొంతన లేదని స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. 

అసెంబ్లీ సమావేశంలో టీఆర్ఎస్ సర్కార్  రేషన్‌‌ కార్డుల వివరాలు ప్రకటించడం చూస్తుంటే రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలో పేదల సంఖ్య ఎక్కువయిందని స్పష్టంగా అర్ధమవుతుంది. రాష్ట్ర జనాభా దాదాపు 4 కోట్ల వరకు ఉండగా.. చట్ట ప్రకారం బీపీఎల్​స్థాయికి దిగువలో ఉన్న కుటుంబాలకు మాత్రమే రేషన్‌‌ కార్డులు ఇస్తారు. అలా గ్రామాల్లోనైతే లక్షన్నరలోపు సంవత్సరాదాయం, పట్టణ ప్రాంతాల్లోనైతే రూ. 2 లక్షలలోపు సంవత్సరాదాయం ఉన్న కుటుంబాలు రేషన్‌‌ కార్డులకు అర్హులు. కాగా దీని ప్రకారం.. 2 కోట్ల 87 లక్షల 68 వేల మంది రేషన్‌‌ లబ్ధిదారులు ఉన్నట్లు సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ప్రకటించడం గమనార్హం. రేషన్ కార్డులున్న 90.49 లక్షల కుటుంబాలు పేదవర్గాలే అంటే.. రాష్ట్ర జనాభాలో 71శాతం పైగా ఏడేండ్లలోనే 21.30 లక్షల మంది పేదరికంలోకి కూరుకుపోయారని రేషన్‌‌ కార్డుల లెక్కలు చూస్తేనే ఈ విషయం  తేటతెల్లమవుతున్నది’ అని విజయశాంతి సోషల్ మీడియాలో కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.

వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల ఎజెండాపై సోనియా గాంధీకి నవజ్యోత్ సిద్ధూ లేఖ

వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల ఎజెండాపై సోనియా గాంధీకి నవజ్యోత్ సిద్ధూ లేఖ

   29 minutes ago


సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటల జమున

సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటల జమున

   an hour ago


టిఆర్ఎస్ పార్టీ లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు

టిఆర్ఎస్ పార్టీ లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు

   5 hours ago


రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు..?

రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు..?

   6 hours ago


పూర్తికాల అధ్యక్షురాలిగా నేనే ఉంటా: సోనియా గాంధీ

పూర్తికాల అధ్యక్షురాలిగా నేనే ఉంటా: సోనియా గాంధీ

   16-10-2021


కొత్త చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ సమావేశం

కొత్త చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ సమావేశం

   16-10-2021


మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఛత్తీస్‌గఢ్‌లో అనారోగ్యంతో మరణించారు

మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఛత్తీస్‌గఢ్‌లో అనారోగ్యంతో మరణించారు

   15-10-2021


టిఆర్ఎస్ పై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్

టిఆర్ఎస్ పై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్

   14-10-2021


ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 400 సీట్లను గెలుచుకోగలదు: అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 400 సీట్లను గెలుచుకోగలదు: అఖిలేష్ యాదవ్

   15-10-2021


మహిళల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్

మహిళల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్

   14-10-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle