newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

ఒవైసీ కి దీటుగా నే సమాధానం చెప్పిందిగా..

09-06-202109-06-2021 07:25:00 IST
Updated On 09-06-2021 07:25:15 ISTUpdated On 09-06-20212021-06-09T01:55:00.324Z09-06-2021 2021-06-09T01:54:44.405Z - 2021-06-09T01:55:15.894Z - 09-06-2021

ఒవైసీ కి దీటుగా నే సమాధానం చెప్పిందిగా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉండ‌గా, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమ‌ర్శించారు. అయితే, ప్రధాని మోడీపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత విజయశాంతి గట్టిగానే  కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ‌లో రాజ‌కీయం హాట్ హాట్ గా మారింది. ఓ వైపు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ న‌డుస్తుంటే మ‌రోవైపు టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అంటూ కామెంట్ల ప‌ర్వం కొన‌సాగుతోంది. కాగా వ్యాక్సినేషన్ల కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా అందిస్తుందని ప్రధానమంత్రి మోడీ ప్రకటించినప్పటి నుండి ప్రతిపక్షాలు మోడీ నిర్ణయం పై పెదవి విరుస్తూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సుప్రీం కోర్టు చివాట్లు పెట్టాక గానీ మోడీ మొద్దు నిద్రనుండి మేల్కొనలేదని ఘాటుగానే మాట్లాడుతున్నారు. 

తాజాగా వ్యాక్సినేషన్ల విషయంపై ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ప్రధాని మోడీ వీఐపీ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నారని, 2020 జూలైలోనే వ్యాక్సిన్ ఆర్డర్ ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని.. వ్యాక్సిన్ కొరత ఉంటే 25 శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు ఎందుకిస్తున్నారని, మోడీ దేశ ప్రజలపై కపట ప్రేమ కురిపిస్తున్నాడని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. దీనిపై బిజెపి నాయకురాలు విజ‌య‌శాంతి కౌంటర్ ఇచ్చారు. “135 కోట్ల పైబ‌డి జనాభా ఉన్నప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ కొరత సహజం ఓవైసీ జీ. ప్రపంచం మొత్తం కూడా చాలా వరకు ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి, 2020 జూలై లో ఎక్కడ ఆమోదించబడ్డ వ్యాక్సిన్ కు, ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఉండాలి..? ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ ట్విన్ పార్టీ TRS అధినేత కేసీఆర్ గారికి చెప్పలేదా?” అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. 

ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకి బిజెపి లీడర్లు గట్టిగానే తిప్పికొడుతున్నప్పటికీ ప్రజలలో సైతం వ్యాక్సినేషన్ల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి సమర్ధనీయం కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

   2 hours ago


ఏపీ రికార్డు స్థాయి టీకా డ్రైవ్‌ పై చిరంజీవి ప్రశంసల జల్లు

ఏపీ రికార్డు స్థాయి టీకా డ్రైవ్‌ పై చిరంజీవి ప్రశంసల జల్లు

   5 hours ago


పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. గత 24 గంటల్లో 2,620 పాజిటివ్ కేసులు

పూర్తిగా కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. గత 24 గంటల్లో 2,620 పాజిటివ్ కేసులు

   9 hours ago


సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు

సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు

   12 hours ago


టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?

   13 hours ago


బాబు మోడీకి బయపడి రాహుల్ గాంధీ పుట్టిన రోజు  శుభాకాంక్షలు కూడా చెప్పలేదు

బాబు మోడీకి బయపడి రాహుల్ గాంధీ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు

   a day ago


తమిళనాడు ఆర్థిక వృద్ధి కోసం ఎస్తేర్ డుఫ్లో, రఘురామ్ రాజన్ తో స్టాలిన్‌ ఆర్థిక సలహా మండలిన ఏర్పాటు

తమిళనాడు ఆర్థిక వృద్ధి కోసం ఎస్తేర్ డుఫ్లో, రఘురామ్ రాజన్ తో స్టాలిన్‌ ఆర్థిక సలహా మండలిన ఏర్పాటు

   21-06-2021


ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, టైమింగ్స్ ఇవే..

ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, టైమింగ్స్ ఇవే..

   21-06-2021


పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో రెండో సారి శరద్ పవార్‌ సమావేశం

పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో రెండో సారి శరద్ పవార్‌ సమావేశం

   21-06-2021


హరీష్ రావు పై ప్రశంశల వర్షం

హరీష్ రావు పై ప్రశంశల వర్షం

   21-06-2021


ఇంకా

Newssting


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle