మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకుల విసుర్లు
09-05-202209-05-2022 08:43:03 IST
2022-05-09T03:13:03.338Z09-05-2022 2022-05-09T03:12:55.331Z - - 27-05-2022

ఏఐసిసి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పర్యటనతో టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. రాహుల్ టూర్ ముగిసిపోయినప్పటికీ ఇంకా ఆ కామెంట్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ 'ఆస్క్ కేటీఆర్' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ సెటైర్లు వేశారు. రాజకీయ అంశాలతో పాటుగా నగరంలో అభివృద్ధి వివిధ సమస్యలు విద్యావిధానం ఎన్నికల్లో మిస్సింగ్ ఓట్లు సహా అనేక అంశాల గురించి నెటిజన్లు కేటీఆర్ ని ప్రశ్నలు అడిగారు. అందరికీ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సమాధానాలు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలతో పాటు..చాలా పార్టీలు మాకు పోటీలో ఉన్నాయి. రాహుల్ గాంధీ మొదట అమేథీలో గెలవడం పై దృష్టి పెట్టాలని చురకలు వేశారు. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ పలు ప్రశ్నలు సంధించారు. ఆస్తులు పెంచుకోడానికి రహస్యమేంటో కేటీఆర్ రాష్ట్ర యువతకు చెప్పాలని వ్యంగంగా కామెంట్ చేశారు. మంత్రి కేటీఆర్ ఆస్తులకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేసిన కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేటీఆర్ సమర్పించిన అఫిడవిట్ లో తనకు రూ.7 కోట్ల ఆస్తులున్నాయని పేర్కొన్నారని... 2018 వచ్చే వరకు కేటీఆర్ ఆస్తులు రూ.41 కోట్లకు పెరిగాయని ఠాగూర్ తెలిపారు. 2018 నుంచి 2023 వరకు టార్గెట్ ఎంత అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. దీంతో ఆస్క్ కేటీఆర్ ఎపిసోడ్లో కూడా సామాన్యుల కామెంట్ల కంటే రాజకీయ నేతల విమర్శలకే ప్రాధాన్యం దక్కిందని, ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు పార్టీ మంత్రి కేటీఆర్ ను ఇరకాటంలో పెట్టేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా