రైతు సంఘర్షణ సభను విజయవంతం చేసిన ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు
08-05-202208-05-2022 07:19:26 IST
2022-05-08T01:49:26.642Z08-05-2022 2022-05-08T01:49:12.796Z - - 27-05-2022

తెలంగాణ రైతాంగానికి అండగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో,శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం లో వరంగల్ లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభను విజయవంతం చేసిన ఆలేరు ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు పెరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక నిర్ణయాలతో మోసపోతున్న తెలంగాణ రైతాంగానికి ఒక భరోసానిస్తూ, రైతు సంఘర్షణ వేదికగా రాహుల్ గాంధీ నాయకత్వంలో వరంగల్ డిక్లరేషన్ ని ప్రవేశ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామనటం చాలా గొప్ప విషయమని అన్నారు. భూమి ఉన్న రైతులు తో పాటు కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని, భూమిలేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఆర్ధిక సాయం చేస్తామని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే కొంటుందని, ముఖ్యంగా వరికి ప్రస్తుతం మద్దతు ధర రూ.1960 ఉంది, దీనికి క్వింటాల్ వడ్లను రూ.2500కు చొప్పున ఇస్తాననడం కాంగ్రెస్ పార్టీ గొప్ప నిర్ణయమని అయిలయ్య అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి పసుపు రైతులను ఆదుకుంటాం, మూతపడ్డ చెక్కర ఫ్యాక్టరీ లు తెరిపిస్తాం, పసుపు పంటను క్వింటాల్‌కు రూ.12 వేలకు కుంటామని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న గొప్ప నిర్ణయమన్నారు. వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణమే నష్టపరిహారం అందేలా, పంటలకు బీమా పథకం అమలు చేసి రైతులను ఆదుకుంటామని, రైతులు, కూలీలకు, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా పధకం వర్తింపు అవుతుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు, సరికొత్త రెవెన్యూ వ్యవస్థ తీసుకోస్తాంమనటం హర్షణీయమని , పోడు రైతులకు, అసైన్డ్ భూముల రైతులకు పట్టాలుతో సహా అని యజమాన్య హక్కులు కలిపించటం చాలా సంతోషమైన విషయమని అన్నారు. రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వరంగల్ డిక్లరేషన్ కు ఆలేరు ప్రజల పట్ల ధన్యవాదాలు తెలుపుతూ.. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ వరంగల్ డిక్లరేషన్ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. కావున ఈ డిక్లరేషన్ ను గ్రామ గ్రామన ప్రతి రైతుకు, ప్రజలకు అర్థమయ్యేలా, ప్రతి గడపకు చేరేలా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నామని బీర్ల అయిలయ్య తెలిపారు.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా