సీఎం కేసీఆర్ కి రేవంత్ రెడ్డి లేఖ.. ఇకనైనా స్పందించరా..?
21-01-202221-01-2022 22:41:17 IST
Updated On 22-01-2022 09:12:15 ISTUpdated On 22-01-20222022-01-21T17:11:17.063Z21-01-2022 2022-01-21T17:02:28.343Z - 2022-01-22T03:42:15.152Z - 22-01-2022

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాసారు. రాష్ట్రంలో అకాల భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని లేఖలో రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని.. మిగతా పంటలకు ఎకరాకు రూ. 25 వేలు చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో తామర తెగులు భారీ వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని.. మిర్చి పంట మంచిగా పండితే ఎకరాకు 3.50 లక్షల ఆదాయం వస్తోందని ఆశపడి ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పెట్టారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. తర్వాత తప్పించుకుని మంత్రులను అధికారులను పంపించారని విమర్శించారు. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో ప్రకృతి వైపరీత్యాలతో దాదాపు రూ.8వేల 633కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. కేంద్రం ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులను ఏం చేశారని ప్రశ్నించారు. వెంటనే రైతులను ఆదుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల కోసం ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వ్రాసిన లేఖ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అయ్యింది.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా