newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రేవంత్ రెడ్డి చెప్పిందే జ‌రిగింది

02-05-202102-05-2021 07:52:23 IST
Updated On 02-05-2021 10:10:32 ISTUpdated On 02-05-20212021-05-02T02:22:23.860Z02-05-2021 2021-05-02T02:22:19.811Z - 2021-05-02T04:40:32.957Z - 02-05-2021

రేవంత్ రెడ్డి చెప్పిందే జ‌రిగింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవును. రేవంత్ రెడ్డేం మామూలు లీడ‌ర్ కాదు. అందుకే.. ఆయ‌న‌కి యూత్ లో అంత ఫాలోయింగ్ ఉంటుంది. యూత్ లోనే కాదు. అన్ని పార్టీల్లోనూ రేవంత్ కి సెప‌రేట్ నెట్ వ‌ర్క్ ఉంటుంది. లీడ‌ర్లు అంతా ఆయ‌న‌తో ట‌చ్ లో ఉంటారు అనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అదీ రేవంత్ ప‌వ‌ర్. ఈ కాంగ్రెస్ సీనియ‌ర్లు ఏదో రేవంత్ ని ఈగో ఫీలింగ్ తో తొక్కేస్తున్నారే త‌ప్ప‌.. రేవంత్ కి గానీ.. ప‌గ్గాలు అప్ప‌జెబితే మ‌సిపూసి మారేడు కాయ చేసి అయినా స‌రే.. పార్టీ బ‌లం పెంచేవారు. పెంచ‌క‌పోయినా.. బ‌లంగా ఉంది అనే ఫీలింగ్ అయినా క‌లిగించే వారు. మంచి లీడ‌రా.. చెడ్డ  లీడ‌రా అనేది వ‌దిలేస్తే.. జిమ్మిక్కులు తెలిసిన లీడ‌ర్ గా పేరుంది రేవంత్ కి.

అందుకే.. టీఆర్ఎస్ గురించి కూడా అప్పుడు అదో ఇదో చెబుతుంటారు రేవంత్ రెడ్డి. కానీ.. మిగ‌తా వాళ్లేమో.. పైకి మాత్రం జ్యోతిష్యం చెబుతున్నారు అనుకుంటారు. పొలిటిక‌ల్ గా లాభం పొంద‌డానికి.. మ్యానిప్యులేట్ చేస్తున్నారు అనుకుంటారు. ఆ మ‌ధ్య హ‌రీశ్ రావు గురించి కూడా ఇంతే చెప్పారు. అన్న‌ట్లే.. పార్టీలో హ‌రీశ్ రావుకి ఇంపార్టెన్స్ త‌గ్గింది. రెండోసారి మంత్రి ప‌ద‌వి కూడా లేట్ గా ఇచ్చారు అంటే అర్దం చేసుకోవ‌చ్చు. కానీ.. బ‌లం బ‌ల‌గం ఉన్న లీడ‌ర్ గా ప‌ద‌వి ఇవ్వ‌క త‌ప్ప‌లేదు. రెండోసారి ఈటెల‌ది కూడా సేమ్ సిచ్చువేష‌న్. ఇక్క‌డ కూడా అంతే. బ‌లం, సీనియార్టీ ఉన్న లీడ‌ర్ కావ‌డంతో.. మంత్రి ప‌ద‌వి త‌ప్ప‌లేదు.

కానీ.. ఈటెల ఏమో కాస్త రెబ‌ల్ టైప్. జెండాలో, పార్టీలో మాకూ హ‌క్కుంది అన‌డం మొద‌లెట్టారు. అప్పుడే చెప్పారు రేవంత్ రెడ్డి. ఈటెల ఇలా అన్నారు. సీఎం కేసీఆర్ ఇక స్కెచ్ వేస్తున్నారు. వారంలో ప‌క్క‌న పెట్టేస్తారు అని అప్ప‌ట్లోనే చెప్పారు. అప్పుడే ఈటెల‌ను కాస్త ప‌క్క‌న పెట్టారు. ప‌వ‌ర్స్ క‌ట్ చేశారు. కానీ.. ఈటెల అవ‌స‌రం చాలా ఉంది. పైగా క‌రోనా టైం క‌దా. ఆరోగ్య శాఖ మంత్రి ఇంపార్టెంట్ క‌దా. ఇక చేసేదేం లేక‌.. మ‌ళ్లీ ఈటెల‌ను యాక్టివ్ కానిచ్చారు అనేది మేథావుల మాట‌. ఇక ఈటెల ప‌రిస్థితి ఇప్పుడు ఏమైందో.. అంద‌రం చూస్తూనే ఉన్నాం. యాజ్ టీజ్ గా.. అప్ప‌ట్లో రేవంత్ రెడ్డి ఏం చెప్పారో ఇప్పుడు అదే జ‌రిగింది. ఈటెల‌ను టార్గెట్ చేస్తున్నారు.. అన్న‌ట్లే టార్గెట్ చేశారు. ప‌క్క‌న పెడ‌తారు అన్న‌ట్లే ప‌క్క‌న పెట్టారు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   21 minutes ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   2 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   8 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   8 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   6 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   9 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   5 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   10 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle