newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

24-07-202124-07-2021 08:16:13 IST
2021-07-24T02:46:13.812Z24-07-2021 2021-07-24T02:46:07.165Z - - 22-09-2021

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ ఐపీస్ అధికారి ప్రవీణ్ కుమార్ త్వరలోనే ఒక పార్టీ పెట్టబోతున్నట్లు రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రవీణ్ కుమార్ చేస్తున్న ప్రసంగాలు సైతం ఆటను పార్టీ పెట్టేందుకు సిద్దం అయ్యాడన్న సంకేతాలు ఇస్తున్నాయి. తాజాగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్‌ బాటలో నడిచేందుకు ఒంటరి పోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఒక్క ప్రవీణ్‌కుమార్‌పై కేసులు పెడితే కోట్లాది మంది ప్రవీణ్‌కుమార్‌లు పుట్టుకొస్తారని వ్యాఖ్యానించారు. పోలీసు ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నావని తన తల్లి ప్రశ్నిస్తే కోట్లాది మంది దళిత బిడ్డలను బాగు చేసేందుకే రాజీనామా చేశాన ని చెప్పానని తెలిపారు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ గురించి నాలుగేళ్ల చిన్న పిల్ల ఎంతో చక్కగా మాట్లాడిందని, అలాంటి ధైర్యం ఆ 29 మంది ఎమ్మెల్యేలకు ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేదని విమర్శించారు. బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలలోనే తాను పయనిస్తానని ఆయన అంటున్నారు. 

అంతే కాదు హుజురాబాద్‌లో దళితబంధు పథకాన్ని పదిహేను వందల కోట్లతో అమలు చేయాలని అనుకుంటున్నారని, ఆ డబ్బులతో దళిత బిడ్డలను అమెరికా, ఆస్ట్రేలియాల్లో చదివించేందుకు పంపితే సత్య నాదెళ్ల, బిల్‌గేట్స్, సుందర్‌ పిచాయ్‌లు అవుతారని ఆయన పేర్కొన్నారు. తమ బిడ్డలు ఎన్ని రోజులు రోడ్లు ఊడ్వాలని, ఎన్ని రోజులు కల్లు గీయాలని, గొర్లు.. బర్లు కాయాలని ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. అమెరికా, ఆస్ట్రేలియా ఎందుకు వెళ్లకూడదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. బీరు బిర్యానీలకి తలొగ్గే జాతులు మనవి కావని నిరూపించుకోవాలని మన రాజ్యం వచ్చే వరకు పోరాటం సాగించాలని ఆయన పిలుపునిచ్చారు. 

సీఎం కేసీఆర్ పై మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఫైర్

సీఎం కేసీఆర్ పై మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఫైర్

   12 hours ago


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు

   12 hours ago


పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..

పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..

   13 hours ago


బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు..

బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు..

   21-09-2021


డ్రగ్స్‌, ఈడీ కేసుల్లో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు..

డ్రగ్స్‌, ఈడీ కేసుల్లో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు..

   21-09-2021


అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

   21-09-2021


రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

   21-09-2021


చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

   20-09-2021


మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

   20-09-2021


5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

   20-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle