newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

సరూర్‌నగర్‌ పరువుహత్యపై స్పందించిన ఒవైసీ

08-05-202208-05-2022 07:29:00 IST
2022-05-08T01:59:00.402Z08-05-2022 2022-05-08T01:58:57.610Z - - 27-05-2022

సరూర్‌నగర్‌ పరువుహత్యపై స్పందించిన ఒవైసీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ఎక్కడ ముస్లింలపై దాడులు జరిగినా స్పందించే ఒవైసీ... సరూర్ నగర్ ఘటనపై మాత్రం ఎందుకు స్పందించట్లేదని ఒవైసీ స్పందించకపోవడం హత్యకు మద్దతునిచ్చినట్లేనని బీజేపీ నేతలు వ్యాఖ్యానించడంతో సరూర్ నగర్ పరువు హత్య ఘటనను ఖండిస్తూ ఒవైసీ స్పందించడం విశేషం. తెలంగాణలోనే కాదు.. యావత్‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించించింది సరూర్‌నగర్ పరువు హత్య ఉదంతం. ఈ ఘటనపై తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. దళిత యువకుడు నాగరాజు హత్యను ఒవైసీ తీవ్రంగా ఖండించారు. 

హైదరాబాద్ దారుస్సలాంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఒవైసీ ప్రసంగిస్తూ.. సరూర్‌నగర్‌లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె(ఆశ్రిన్ సుల్తానా) తన ఇష్టపూర్వకంగానే ఆ వ్యక్తిని (నాగరాజు) పెళ్లి చేసుకుంది. అది సరైన చర్యే. కానీ,  సుల్తాన్ సోదరుడికి ఆమె భర్తను చంపే హక్కు ఎక్కడిది? రాజ్యాంగం ప్రకారం హత్య చేయడం క్రూరమైన చర్య, ఇస్లాం ప్రకారం దారుణమైన నేరం కూడా. సరూర్ నగర్ హత్య ఘటనకు వేరే రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి ఒవైసీ కామెంట్స్ చేశారు. హత్య ఘటనలో నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారని, తాము హంతకుల పక్షాన నిలబడేవాళ్లం కాదని ఆయన అన్నారు.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!

   14-05-2022


టీఆర్‌ఎస్‌ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్‌ సావంత్‌ విమర్శలు

టీఆర్‌ఎస్‌ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్‌ సావంత్‌ విమర్శలు

   13-05-2022


నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన

   13-05-2022


నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ హెచ్చరిక

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ హెచ్చరిక

   13-05-2022


ఏపీ కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..

ఏపీ కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..

   13-05-2022


గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే

   12-05-2022


శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే

   12-05-2022


ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అనూహ్య నిర్ణయం

ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అనూహ్య నిర్ణయం

   12-05-2022


ఫిలిప్పీన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్‌ గెలుపు!

ఫిలిప్పీన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్‌ గెలుపు!

   11-05-2022


ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా

   11-05-2022


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle