newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

21-09-202121-09-2021 07:19:27 IST
Updated On 21-09-2021 11:05:29 ISTUpdated On 21-09-20212021-09-21T01:49:27.342Z21-09-2021 2021-09-21T01:49:15.193Z - 2021-09-21T05:35:29.622Z - 21-09-2021

రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఐటి మంత్రి కేటీఆర్ ల మధ్య మాటల యుద్ధం తారా స్తాయికి చేరింది. గత రెండు మూడు రోజులుగా రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ కి, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి వైట్ చాలెంజ్ పేరిట డ్రగ్ తీసుకున్నారా, లేదా అని తెలుసుకోవడానికి రక్త పరీక్షలు టెస్ట్ చేసుకోవాలని సవాల్ విసిరారు. అయితే రేవంత్ రెడ్డి దురుద్దేశంతో గత కొంతకాలంగా తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారని సిటీ సివిల్‌ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిర్వహిస్తున్న విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో కానీ, ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయినా రేవంత్‌రెడ్డి దురుద్దేశంతో పదే పదే తన పేరును ప్రస్తావిస్తున్నారని అన్నారు. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆయన దుష్ప్రచారం వల్ల తనకు సంభవించిన పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను సైతం ప్రారంభించాలని కేటీఆర్‌ కోరారు.  కాగా ట్విట్టర్‌లో ‘రాహుల్‌ డ్రగ్‌ టెస్ట్‌’ హ్యాష్‌ట్యాగ్‌ను వేలాది మంది రీ ట్వీట్‌ చేయడంతో పొలిటికల్‌ న్యూస్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. రాహుల్‌ గాంధీ కూడా ఎయిమ్స్‌లో డ్రగ్‌ టెస్ట్‌కు ముందుకు రావాలని పలువురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు, ఇతర నేతలు, నెటిజన్లు ట్వీట్‌ చేశారు. అయితే డ్రగ్స్‌ విషయంలో రక్త పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమని మంత్రి కేటీఆర్‌ చెప్పిన తర్వాతే తాను ఆయన్ను సవాల్‌ చేశానని రేవంత్‌ పేర్కొన్నారు. తన సవాల్‌కు జవాబు చెప్పాల్సింది పోయి ఆవేశానికి గురై బెదిరించే విధంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రస్తుతం ఈ వైట్ చాలెంజ్ వార్తలు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. 

సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటల జమున

సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటల జమున

   32 minutes ago


టిఆర్ఎస్ పార్టీ లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు

టిఆర్ఎస్ పార్టీ లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు

   4 hours ago


రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు..?

రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు..?

   5 hours ago


పూర్తికాల అధ్యక్షురాలిగా నేనే ఉంటా: సోనియా గాంధీ

పూర్తికాల అధ్యక్షురాలిగా నేనే ఉంటా: సోనియా గాంధీ

   16-10-2021


కొత్త చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ సమావేశం

కొత్త చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ సమావేశం

   16-10-2021


మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఛత్తీస్‌గఢ్‌లో అనారోగ్యంతో మరణించారు

మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఛత్తీస్‌గఢ్‌లో అనారోగ్యంతో మరణించారు

   15-10-2021


టిఆర్ఎస్ పై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్

టిఆర్ఎస్ పై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్

   14-10-2021


ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 400 సీట్లను గెలుచుకోగలదు: అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 400 సీట్లను గెలుచుకోగలదు: అఖిలేష్ యాదవ్

   15-10-2021


మహిళల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్

మహిళల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్

   14-10-2021


నామినేషన్ ని ఉపసంహరించుకున్న ఈటల జమున.. ఆ ముగ్గురి నామినేషన్ చెల్లదు.

నామినేషన్ ని ఉపసంహరించుకున్న ఈటల జమున.. ఆ ముగ్గురి నామినేషన్ చెల్లదు.

   14-10-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle