newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

దళిత బంధు పథకం పై విమర్శలు చేయడం అర్ధ రహితం

22-07-202122-07-2021 12:00:33 IST
2021-07-22T06:30:33.190Z22-07-2021 2021-07-22T06:30:20.933Z - - 25-07-2021

దళిత బంధు పథకం పై విమర్శలు చేయడం అర్ధ రహితం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దళిత బంధు పతాకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలని సిఎం కేసీఆర్ గట్టిగా తిప్పికొట్టారు. దళితబంధు తమాషా పథకం కాదు. ఎన్నికలున్నాయని హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని పెడుతున్నారని కొందరంటున్నరు. మా పార్టీ సన్నాసుల మఠమా? మాదీ రాజకీయ పార్టీయే. టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండి, సీఎం ఉంటేనే ఇలాంటి పథకం సాధ్యం. ఏ పని చేయనోడే లాభం కోరుకుంటే.. చేసిన రాజకీయ పార్టీగా లాభం కోరుకోవడం తప్పా. ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు సమయమున్నా దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టడం అక్కడి ప్రజల అదృష్టం అన్నారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన హుజూరాబాద్‌ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి బుధవారం తెలంగాణభవన్‌ వేదికగా టీఆర్‌ఎస్‌లో చేరారు. కౌశిక్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కష్టపడి సాధించిన రాష్ట్రం, ఎవరూ అప్పనంగా ఇవ్వలేదు. శాశ్వతంగా అధికారం ఎవరికీ ఉండదు. ఇది రాచరిక వ్యవస్థ కాదు. ఎన్టీఆర్‌ అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్యే అయిన. నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా నా ప్రసంగం విని స్పీకర్‌ కౌగిలించుకున్నారు. రాష్ట్ర సాధన కోసం చాలా మంది మహనీయులు పనిచేశారు. 1969 నాటి ఉద్యమం తెలంగాణ సమాజానికి చాలా నేర్పించింది. మర్రి చెన్నారెడ్డి ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు. చరిత్రని ఎవరూ వక్రీకరించలేరు. ఏ పూటకు ఆ పూట రాజకీయాలు చేసే వారికి ఇలాంటివి అర్ధం కావని కేసీఆర్ దయ్యబట్టారు. కొందరు బ్రోకర్ గాళ్ళు నోరుంది కదాని కుక్కలు మొరిగినట్లు మొరుగుతున్నారు. ప్రజలు దీనిని గమనిస్తూనే ఉన్నారని అన్నారు.  ప్రజల అనుభవాలు, ఆకాంక్షల మేరకే తమ ప్రభుత్వం ముందుకు పోతోందని చెప్పారు. మొత్తానికి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఇక హుజూరాబాద్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి నిలబడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

   5 hours ago


కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

   12 hours ago


మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

   12 hours ago


ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

   13 hours ago


టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

   24-07-2021


వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

   24-07-2021


మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

   24-07-2021


కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

   24-07-2021


ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

   24-07-2021


AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

   23-07-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle