newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈటెల‌పై రేవంత్ అన్న‌ట్లే.. కోర్టు కూడా ప్ర‌శ్నించింది

04-05-202104-05-2021 20:19:56 IST
Updated On 05-05-2021 07:03:18 ISTUpdated On 05-05-20212021-05-04T14:49:56.284Z04-05-2021 2021-05-04T14:47:05.928Z - 2021-05-05T01:33:18.858Z - 05-05-2021

ఈటెల‌పై రేవంత్ అన్న‌ట్లే.. కోర్టు కూడా ప్ర‌శ్నించింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏంద‌బ్బా ఇది. రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంది. అస‌లే సీఎం కి క‌రోనా వ‌చ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయన బాధ‌ల్లో ఆయ‌న ఉన్నారు. క‌రోనా వ‌చ్చి స్టేట్ మొత్తం ప్రాణాలు గుప్పిట్లో ప‌ట్టుకుని బ‌తుకుతున్నారు. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని సీరియ‌స్ గా ఉన్నారు. కానీ.. సీఎం కేసీఆర్ కే క‌రోనా.. ఆయ‌న పుత్ర‌ర‌త్నం కేటీఆర్ కీ క‌రోనా. పాపం వాళ్లు మాత్రం ఏం చేస్తారు చెప్పండి అనుకున్నారు. కానీ.. స‌డన్ గా సింహం నిద్ర లేచింది. అదేనండీ.. కేసీఆర్ అంటే అంతే క‌దా. సింహం నిద్ర లేచింది.. ఈటెల పై ప‌డింది. అదేంటీ.. ఈటెల త‌న మంత్రిత్వ శాఖ ప‌నుల్లో బిజీగా ఉన్నారు క‌దా.. అస‌లే క‌రోనా క‌దా అనుకున్నాం.. అనుకుంటున్నాం. కానీ.. పులి నిద్ర‌లేస్తే అంతే ఉంటుంది. ఓహ్.. ఇందాక సింహం అనుకున్నాం క‌దా. స‌రెలెండి.. సింహ‌మే అనుకుందాం ఇప్పుడు కూడా.

ఓ ప‌ద్ద‌తీ గ‌ట్రా ఉంట‌య్ క‌దా. ఓ స‌హ‌చ‌ర మంత్రిని టార్గెట్ చేయాలి అంటే.. ముందు పిల‌వాలి.. వివ‌ర‌ణ అడ‌గాలి అవేం చేయ‌లేదు. సీఎం కేసీఆర్ ఆర్డ‌ర్లు వేశారు. క‌లెక్ట‌ర్ వెళ్లారు. స‌ర్వే చేశారు. ఈటెల క‌బ్జా చేశారు. క‌బ్జా క‌బ్జా క‌బ్జా అంటూ.. డ‌ప్పులు కొట్టారు. ఇక క‌లెక్ట‌ర్లే ప్రూవ్ చేశారు అంటే.. జ‌నం లో కూడా కాస్త న‌మ్మ‌కం వ‌స్తుంది క‌దా. ఎగ్జాక్ట్ గా అదే చేశారు. కానీ... రేవంత్ రెడ్డి ఓ మాట బ‌య‌టికి తీశారు. అదేంటండీ.. భూ స‌ర్వే అంటే.. ఓ ప‌ద్ద‌తీ గ‌ట్రా ఉంటుంది క‌దా. ఎట్టా ప‌డితే అట్టా స‌ర్వేలు ఎట్టా చేస్తారు. రిపోర్టులు ఎట్టా ఇస్తారు. ఇదేం ప‌ద్ద‌తి.. ఉరి శిక్ష వేసే వారిని కూడా ఓ ప‌ద్ద‌తి ప్రకారమే విచార‌ణ చేసి.. ఫైన‌ల్ చేస్తారు కానీ.. స‌డ‌న్ గా దోషి ఉరి శిక్ష వేసేయండి అన‌రు క‌దా. య‌ట్ లీస్ట్ నోటీసులు అయినా ఇవ్వాలి క‌దా. ఈటెల ఫ్యామిలీకే కాదు. ప‌క్క‌న ఉన్న స‌ర్వే నెంబ‌ర్ల‌కి కూడా నోటీసులు ఇవ్వాలి. గొలుసులు తీసుకెళ్లి స‌ర్వేలు చేయాలి. ఇదేంటంయ్యా ఇదీ అంటూ.. పాయింట్స్ రెయిజ్ చేశారు.

మ‌రి ఈటెల రాజేంద‌ర్ మాత్రం అల్లా ట‌ప్పా లీడ‌ర్ ఏం కాదు క‌దా.  20 ఏళ్ల నుంచి ప‌ద‌వుల్లో ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో కీల‌కంగా ప‌ని చేశారు. గుడ్డుపై గుడ్డు పేర్చి.. కోడి త‌ర్వాత కోడిని  పెంచి.. ఇంత బిజినెస్ మ్యాన్ అయ్యారు. ఆయ‌న కూడా ఇక ఆగేది లేదు అంటూ.. హైకోర్టు కెళ్లారు. ఇదేం ప‌ద్ద‌తి అన్నారు. అంతే కోర్టు కూడా ఆయ‌న పిటిష‌న్ ను విచార‌ణ‌కు తీసుకుంది. ఇదేం స‌ర్వే.. ఇట్టా ఎట్టా స‌ర్వే చేస్తారు. ఓ ప‌ద్ద‌తి ఉంటుంది క‌దా అని చెప్పంది హైకోర్టు. ఆయ‌న కంపెనీల‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల విష‌యంలో ఎలాంటి యాక్ష‌న్లు తీసుకోకండి.. అని చెప్పింది హైకోర్టు. అస‌లు క‌లెక్ట‌ర్ నివేదిక‌తో సంబంధమే లేకుండా చ‌ట్ట ప్ర‌కారం మూవ్ అవ్వండి అని చెప్పంది కోర్టు. అంటే ఏంటి.. క‌లెక్ట‌ర్ మ‌రి ఎలాంటి నివేదిక ఇచ్చారు అంటారా.... రెండు మూడు రోజులుగా చూస్తూనే ఉన్నాం క‌దా.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   an hour ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   3 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   9 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   9 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   7 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   10 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   6 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   11 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle