newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

టిఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసిన గట్టు రామచంద్రరావు..

26-11-202126-11-2021 08:23:25 IST
2021-11-26T02:53:25.777Z26-11-2021 2021-11-26T02:53:19.053Z - - 29-11-2021

టిఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసిన గట్టు రామచంద్రరావు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీఆర్ఎస్ లో అసంతృప్తి సెగ తగులుతోంది. ఖమ్మం జిల్లాలో మొదటి రాజీనామా పర్వం మొదలయ్యింది. టిఆర్ ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత గట్టు రామచందర్ రావు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేసీఆర్‌‌కు పంపారు. మీరు ఆశించిన స్థాయిలో తాను పార్టీలో రాణించలేకపోయానన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని తాను భావించానన్నారు. అందుకే టీఆర్‌ఎస్‌ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇంతకాలం పార్టీలో తనకు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

 

 

అయితే గట్టు రామచంద్రరావు ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు అవకాశం కల్పిస్తారని ఆయన ఆశించారు. అయితే గట్టుకు కాకుండా తాతా మధుకు ఆ స్థానాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన గట్టు రాజీనామా చేశారని తెలుస్తోంది. గతంలో వామపక్ష పార్టీలో క్రియాశీలకంగా గట్టు పనిచేశారు. తరువాత వైసీపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరి కేసీఆర్‌కు నమ్మినబంటుగా మారారు. మరి గట్టు ఏ పార్టీలో చేరుతారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

టి కాంగ్రెస్ లో విభేదాలు లేవు.. అందరం కలిసే పనిచేస్తామంటున్న కోమటిరెడ్డి

టి కాంగ్రెస్ లో విభేదాలు లేవు.. అందరం కలిసే పనిచేస్తామంటున్న కోమటిరెడ్డి

   12 hours ago


భారీ వర్షాల కారణంగా రేపు ఆ ఏడు జిల్లాల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం

భారీ వర్షాల కారణంగా రేపు ఆ ఏడు జిల్లాల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం

   12 hours ago


ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలి

ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలి

   12 hours ago


అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్.. ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..

అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్.. ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..

   a day ago


ఏపీలో మళ్లీ తెరపైకి జిల్లాల పునర్విభజన అంశం

ఏపీలో మళ్లీ తెరపైకి జిల్లాల పునర్విభజన అంశం

   27-11-2021


ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన

ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన

   27-11-2021


మళ్లీ మంగళగిరి నుండే పోటీ చేస్తానంటున్న నారా లోకేష్

మళ్లీ మంగళగిరి నుండే పోటీ చేస్తానంటున్న నారా లోకేష్

   27-11-2021


ఈసారి పంజాబ్ లో ఆమ్‌ ఆద్మీ పార్టీ జెండా ఎగురుతుందనే సంకేతాలు వస్తున్నాయి

ఈసారి పంజాబ్ లో ఆమ్‌ ఆద్మీ పార్టీ జెండా ఎగురుతుందనే సంకేతాలు వస్తున్నాయి

   27-11-2021


సినిమా టిక్కెట్ ధరలపై ఏపీ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ఫైర్

సినిమా టిక్కెట్ ధరలపై ఏపీ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ఫైర్

   27-11-2021


ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా 44 మంది మరణించారు, 16 మంది అదృశ్యమయ్యారు

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా 44 మంది మరణించారు, 16 మంది అదృశ్యమయ్యారు

   27-11-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle