newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

తెలంగాణలోని అన్ని జిల్లాలలో దళితబంధు అమలు

22-01-202222-01-2022 21:16:35 IST
2022-01-22T15:46:35.647Z22-01-2022 2022-01-22T15:46:28.841Z - - 27-05-2022

తెలంగాణలోని అన్ని జిల్లాలలో దళితబంధు అమలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సిఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలో అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు శనివారం ప్రకటిచారు. బ్యాంక్‌ లింకేజీతో సంబంధం లేకుండా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ప్రతి నియోజకవర్గంలో యూనిట్‌కు 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయమని సీఎం కేసీఆర్‌ అధికారులకు తెలిపారు. లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్‌నే ఎంపిక చేయాలని సీఎం సూచించారు. దళితబంధు అమలు వేగవంతం చేయాని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. మార్చి నెలతో 100 శాతం గ్రౌండింగ్‌ చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల సలహాతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని చూచించారు. లబ్ధిదారుల జాబితాను జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు ఆమెదించాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో దళితబందు ని సిఎం కేసీఆర్ తెరపైకి తీసుకు వచ్చారని, తర్వాత మరిచిపోయారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సిఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతిపక్షాల విమర్శలకి చెక్ పెట్టినట్లు అయ్యింది.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!

   14-05-2022


టీఆర్‌ఎస్‌ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్‌ సావంత్‌ విమర్శలు

టీఆర్‌ఎస్‌ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్‌ సావంత్‌ విమర్శలు

   13-05-2022


నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన

   13-05-2022


నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ హెచ్చరిక

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ హెచ్చరిక

   13-05-2022


ఏపీ కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..

ఏపీ కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..

   13-05-2022


గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే

   12-05-2022


శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే

   12-05-2022


ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అనూహ్య నిర్ణయం

ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అనూహ్య నిర్ణయం

   12-05-2022


ఫిలిప్పీన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్‌ గెలుపు!

ఫిలిప్పీన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్‌ గెలుపు!

   11-05-2022


ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా

   11-05-2022


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle