newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

సిఎం కేసీఆర్ మాటలు తట్టుకోలేకనే రైతుల ఆత్మహత్యలు..

14-09-202114-09-2021 21:26:16 IST
2021-09-14T15:56:16.845Z14-09-2021 2021-09-14T15:55:59.888Z - - 22-09-2021

సిఎం కేసీఆర్ మాటలు తట్టుకోలేకనే రైతుల ఆత్మహత్యలు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సిఎం కేసీఆర్ బిజెపి అధిష్టానాన్ని తప్పు పడుతూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అయిదు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రి వేస్తే ఉరి వేసినట్లేనని సీఎం చెప్పాక 5 గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బండి సంజయ్‌ తెలిపారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. సీఎం మాటలు తట్టుకోలేక తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, సీఎం వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వర్షాలతో తెలంగాణలో పంటలు ఎక్కువ పండుతున్నాయని, ఆ పంటలను కొనడం చేతగాని సీఎం ఆ నెపాన్ని కేంద్రంపై మోపాలని చూస్తున్నాడని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధులను రైతులకు కేసీఆర్‌ ఎందుకు అందించడం లేదని,  ఫసల్ బీమా ఎందుకు అమలు చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఢిల్లీ టూర్ సందర్భంగా సిఎం కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి వంగి వంగి దండాలు పెట్టి, తీరా రాష్ట్రానికి చేరుకున్న తరువాత బిజెపి ని విమర్శించడం తో సిఎం కేసీఆర్ ద్వంద వైఖరి అర్ధమవుతుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బీజేపీ పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక తమ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేయిస్తున్నాడని ఇంటిలిజెన్స్ సర్వేలో వచ్చే ఎన్నికల్లో  బీజేపీ  అధికారంలోకి  రావడం ఖాయమని  తెలుసుకున్న సీఎం కేసీఆర్ తెలంగాణ లో బీజేపీని తొక్కేయాలని పగటి కలలు కంటున్నారని ఆరోపించారు. అయితే ఢిల్లీ లో బిజెపి పెద్దలపై ప్రశంసలు కురిపించి తనకి అనుకూలంగా కొన్ని పనులని అధిష్టానం పెద్దలతో చేయించుకున్న కేసీఆర్ రాష్ట్రంలో బిజెపి అధ్యక్షుడిని విమర్శించడం వెనుక పెద్ద మతలబు దాగుందని, ఇటు టిఆర్ఎస్, అటు బిజెపి లు ఆడుతున్న నాటకంలో భాగమే ఈ విమర్శల పర్వం అని మిగతా పార్టీల వారు దెప్పి పొడుస్తున్నారు. 

సీఎం కేసీఆర్ పై మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఫైర్

సీఎం కేసీఆర్ పై మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఫైర్

   10 hours ago


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ మండిపాటు

   11 hours ago


పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..

పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు చూపిన పవర్ ఇంతేనా..

   12 hours ago


బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు..

బీజేపీ విజయం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్కటే సరిపోదు..

   a day ago


డ్రగ్స్‌, ఈడీ కేసుల్లో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు..

డ్రగ్స్‌, ఈడీ కేసుల్లో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు..

   a day ago


అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

   21-09-2021


రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

   21-09-2021


చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

   20-09-2021


మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

   20-09-2021


5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

   20-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle