కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ని గద్దె దించబోతున్నారా..?
22-07-202122-07-2021 12:06:02 IST
Updated On 22-07-2021 12:14:48 ISTUpdated On 22-07-20212021-07-22T06:36:02.344Z22-07-2021 2021-07-22T06:34:53.225Z - 2021-07-22T06:44:48.687Z - 22-07-2021

గత కొన్ని రోజులుగా కర్ణాటక ముఖ్యమంత్రిని మారుస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మరో నాలుగు రోజుల్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్న యడ్యూరప్ప తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని ఆయనను పదవి నుంచి తప్పించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు రాష్ట్రంలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే యడ్యూరప్ప వారసుడు ఎవరన్న చర్చ తెరపైకి వచ్చింది. యడియూరప్ప స్థానంలో సీఎంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి.రవి, బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బి.ఎల్.సంతోష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే బిజెపి అధిష్టానం చివరి నిమిషంలో నిర్ణయాలు మార్చుకుని వీరిలో ఒకరిని కాకుండా మరో కొత్త నాయకుడికి కర్ణాటక పగ్గాలు అప్పగించినా ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ నేపధ్యంలో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారని మంత్రులు మురుగేష్ నిరానీ, బసవరాజ్ ఎస్.బొమ్మై, ఆర్.అశోక్, సి.ఎన్.అశ్వత్థ నారాయణ్, జగదీష్ షెట్టర్(మాజీ సీఎం), ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే తెరపైకి వచ్చిన వీరిలో ఒకరికి సిఎం సీటు వరిస్తుందా.. లేదంటే మరో కొత్త నాయకుడికి అధిష్టానం ఈ బాధ్యత అప్పగిస్తుందా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్‌కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా